టీడీపీ మాజీ ఎంపీకి ప్రధాని మోదీ కీలక పదవి..!!
టీడీపీ మాజీ ఎంపీకి కీలక పదవి దక్కింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ నుంచి ఇప్పటికే ఒక గవర్నర్ పదవి కేటాయించారు. కేంద్రంలో ఇద్దరు మంత్రులు కొనసాగుతున్నారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు. కాగా.. టీడీపీ ఎంపీగా వ్యవహరించిన నేతకు ఇప్పుడు ముఖ్యమైన పదవి ఖరారైంది. చంద్రబాబు సిఫారసు మేరకు ఆయనకు ఈ పదవి కేటాయించినట్లు సమాచారం. అదే సమయంలో కేంద్రంలో టీడీపీకి మరి కొన్ని నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.
టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కు కేంద్రం కీలక పదవి కట్టబెట్టింది. కేంద్రం తాజాగా సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ పదవులను ప్రకటించింది. అందులో టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన కనకమేడల రవీంద్ర కుమార్ కు కేటాయించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో కనకమేడల మినహా మిగిలిన సభ్యులు బీజేపీలో విలీనం అయ్యారు.

కనకమేడల మాత్రం టీడీపీలోనే కొనసాగారు. తొలి నుంచి పార్టీ లీగల్ వ్యవహారాల్లో కనకమేడల కీలకంగా వ్యవహరించారు. 2024 ఎన్నికల సమయం లో బీజేపీ - టీడీపీ పొత్తు వేళ కనకమేడల తన వంతు పాత్ర పోషించారు. కేంద్రంలో ఎన్డీఏ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కనకమేడలకు కీలక పదవి దక్కుతుంది అని పార్టీ నేతలు అంచనా వేసారు.
ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పదవికి దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన న్యాయపదవుల్లో ఒక్కటిగా గుర్తింపు ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన న్యాయ అంశాలపై కనకమేడల రవీంద్ర కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో భాగంగా కనకమేడలకు అదనపు సొలిసిటర్ జనరల్ పదవి పైన సీఎం చంద్రబాబు ఢిల్లీ ముఖ్యులతో సంప్రదింపులు చేసారు.
కేంద్రంలో పదవుల కోటాలో భాగంగా టీడీపీ నుంచి కనకమేడల పేరు ఖరారైంది. అదే విధంగా మరి కొందరికి కేంద్రం లో నామినేటెడ్ పదవుల కోసం పేర్లు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. మరో గవర్నర్ పదవి సైతం టీడీపీకి కేటాయిస్తారనే ప్రచారం ఉంది. కాగా.. ఈ పదవి బీసీ వర్గానికి ఇస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కనకమేడలకు కీలక పదవి దక్కటం ద్వారా.. త్వరలోనే ఇతర పోస్టులను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications