ఏపీకి కేంద్రం భారీ ప్రాజెక్టు - సీమ లో గేమ్ ఛేంజర్..!!

ఏపీకి కేంద్రం మరో వరం ప్రకటించింది. ప్రధాని మోదీ మూడో సారి ప్రధాని అయిన తరువాత ఏపీ కి కేంద్రం నుంచి మద్దతు పెరిగింది. అమరావతి, పోలవరం తో పాటుగా కీలక ప్రాజెక్టులకు సహకా రం అందుతోంది. అమరావతికి రైల్వే లైన్.. ఓఆర్ఆర్ కు ప్రత్యేకంగా ఆమోదం లభించింది. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. జాతీయ రహదారుల విషయంలో ఏపీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రివర్గ భేటీలో మరో కీలక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఏపీకి మోదీ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టును ప్రకటించింది. కడప జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు జిల్లాలోని గురివిందపూడి వరకు 4 వరుసల రోడ్డుకు పచ్చజెండా ఊపింది. 3,653 కోట్ల రూపాయల వ్యయంతో 108 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని నిర్మించనున్నట్లు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ రహదారి నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తర కర్ణాటకలోని ఆర్థిక కారిడార్‌కు పోర్టు కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. 23 కి.మీ మేర అప్‌గ్రేడ్‌, 85 కి.మీ మేర గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం, బిల్డ్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిలో హైవే నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రత్లాం-నగడ రైల్వే మార్గాన్ని 4 వరుసలుగా, అలానే వార్దా-బల్లార్షా రైల్వే మార్గాన్ని కూడా 4 వరుసలుగా మార్పునకు కేబినెట్‌ నిర్ణయించింది.

central-cabinet-approves-the-badvel-nellore-corridor-on-the-existing-nh-67

ఈ ప్రాజెక్టులో భాగంగా మనుబోలు మండలం గురువిందపూడి సమీపంలోని కృష్ణపట్నం పోర్టు రోడ్డు నుంచి బద్వేల్‌ మండలం గోపవరం వరకు 108.13 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు.'పోర్టు రోడ్డు టు బద్వేల్‌' జాతీయ రహదారి ప్రాజెక్టును డిజైన్‌-బిల్ట్‌-ఫైనాన్స్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌(డీబీఎ్‌ఫవోటీ) పద్ధతిలో నిర్మించనున్నారు. మనుబోలు, పొదలకూరు, చేజర్ల, అనంతసాగరం, మర్రిపాడు మండలాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరుపుకోనుంది. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టు, ఇతర పరిశ్రమల నుంచి వాహనాలు రాయలసీమ ప్రాంతానికి వెళ్లాలంటే ముంబై హైవేపైనే ఆధారపడుతున్నారు. మొత్తంగా ఈ రోడ్డు ప్రాజెక్టుకు రూ.3653.10 కోట్లను ఖర్చు చేయనున్నారు. వచ్చే నెలలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు టెండర్లు పిలిచేందుకు కసరత్తు జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+