కేంద్ర కేబినెట్ లోకి ఏపీ బీజేపీ నేత - తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మార్పు..!!
కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పాలన..పార్టీలో మార్పుల దిశగా బీజేపీ అధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర మంత్రుల్లో పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగించనుంది.
ఈ సారి ప్రక్షాళణలో ఏపీ, తెలంగాణ నుంచి ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పు తప్పదని చెబుతున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలను పరిగణలోకి తీసుకొని మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

కేంద్ర కేబినెట్ లో మార్పులు: వచ్చే ఎన్నికలకు పూర్తి సంసిద్దత దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. త్వరలో జరిగే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అవసరమైన మార్పులకు సిద్దం అవుతోంది. ఎన్టీఏ ను మరిన్ని పార్టీలతో విస్తరించే ప్రక్రియ పైన ఆలోచన చేస్తోంది.
ప్రధాని మోదీ ఈ నెల 21న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ టూర్ కు ముందు..లేదా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందుగానే కేంద్ర కేబినెట్ ప్రక్షాళనతో పాటుగా పార్టీ అధ్యక్షుల మార్పు నిర్ణయాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల మార్పుకు నిర్ణయించినట్లు సమాచారం. అందులో ఏపీ ,తెలంగాణ ఉన్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించే ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల మార్పు: కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రుల మార్పు పైనా కసరత్తు జరగుతున్నట్లు తెలుస్తోంది. ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను తప్పించి, ఐటీ..కమ్యూనికేషన్ల శాఖకు పరిమితం చేయాలనేది పార్టీ నాయకత్వం ఆలోచనగా సమాచారం. క్రీడల శాఖ నుంచి అనురాగ్ ఠాకూర్ ను తప్పించే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగే తొమ్మిది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రుపైన భారం తగ్గించి..పార్టీ వ్యవహారాల పైన ఫోకస్ చేసేలా కేబినెట్ మార్పులు ఉంటాయని చెబుతున్నారు.
కొందరు సీనియర్లకు పూర్తిగా ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ప్రస్తుతం ఒక్కరే తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక మంత్రిగా కేంద్ర కేబినెట్ లో కొనసాగుతున్నారు. కిషన్ రెడ్డిని కొనసాగిస్తేనే తెలంగాణ, ఏపీ నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం సాగుతోంది.తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను కొనసాగిస్తే ఏపీకి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది.
కేబినెట్ లో ఛాన్స్ దక్కేదెవరికి: ఏపీ నుంచి ఎవరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం ఇస్తారనే చర్చ మొదలైంది. ఏపీ నుంచి జీవీఎల్ నర్సింహారావు...సీఎం రమేష్ పేర్లు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. జీవీఎల్ ఏపీకి చెందిన వారే అయినా యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జీవీఎల్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. సామాజిక సమీకరణాల్లో జీవీఎల్ కు అవకాశం తక్కువ.
సీఎం రమేష్ టీడీపీ నుంచి వచ్చిన నేత కావటంతో బీజేపీ నిర్ణయం ఏంటనేది చూడాలి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తున్నా..ఆయనకు ఎన్నికల ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తారనే వాదన వినిపిస్తోంది. ఇటు పొత్తులు..భవిష్యత్ కార్యాచరణలో భాగంగా మంత్రివర్గంలో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఏపీ కొత్త బీజేపీ చీఫ్ పైన ఉత్కంఠ నెలకొంది. టీడీపీతో పొత్తు పైన నిర్ణయం తీసుకున్న తరువాత నే ఏపీ నుంచి కేంద్రం మంత్రి..కొత్త అధ్యక్షుడిపైన నిర్ణయం ఉండే అవకాశం ఉంది.
-
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications