నరేంద్రమోడీ దత్తపుత్రుడు ఎవరు?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాజధాని అమరావతి మొండి గోడలుగా మిగిలిపోతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు రోడ్డెక్కారని, దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే ఏపీ అధ్వాన్నస్థితికి చేరిందని, ఆంధ్రప్రదేశ్ అంటే అబద్దాల ప్రదేశ్‌గా మారిందన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియాతో సమావేశంలో చింతా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియాతో చింతా మోహన్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

మోడీకి జగన్ దత్తపుత్రుడు
వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు డబ్బే డబ్బు అంటున్నారు. వారు దోచుకునే విధానం చూసిన తర్వాత వ్యవస్థ అంటేనే ఆవేదన కలుగుతోంది. అసెంబ్లీ వేదికగా అబద్దాలు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఒక్కటే ఉంది. విభజన చట్టంలోని ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారు. మోడీకి జగన్ దత్తపుత్రుడు.. ఆయన ఏం చెబితే అదే జగన్ చేస్తాడు. ప్రభుత్వ ధనాన్ని మోడీ అదానీకి దోచిపెడుతున్నాడు. ఏపీ అదానీ ప్రదేశ్ గా మారుతోంది.

విజయవాడలో ఆకలితో 2 లక్షల మంది
ప్రత్యేక రాష్ట్రం ఎటు పోయిందో? ఏపీలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. పేదవారు రోజుకు రూ.100 కూడా సంపాదించలేని పరిస్థితి. దేశవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్నవారు 60 కోట్ల మంది ఉన్నారు. వారు ఆకలితో నిద్రపోవడంలేదు. ఏపీలో కోటి మంది, విజయవాడలో 2 లక్షల మంది ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. ఒక్క పూట భోజనం కూడా అందడంలేదు. జగన్ చెప్పిన రాజన్న రాజ్యం ఇదేనా? తండ్రి ఆశయానికి తూట్లు పొడిచారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు లేవు.. హాస్టల్ ఛార్జీలు లేవు.

గురువులను బంట్రోతులుగా మార్చారు
గురువులను బంట్రోతులుగా మార్చిన ఘనుడు. ఒక్క టీచర్ కూడా సంతృప్తిగా పనిచేయడంలేదు. విద్య, వైద్యరంగాలను పూర్తిగా నాశనం చేశారు. ఏపీని అంధకారంలోని నెట్టడమేకాదు ప్రజలను కూడా నెట్టారు. మెరుగైన వైద్యం లేదు. నర్సులే ఆపరేషన్లు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు పట్టంకట్టారు. ఇప్పుడు సాగనంపేందుకు ఎదురు చూస్తున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు వస్తాయి. రాహుల్ గాంధీ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. మేం అధికారంలోకి రాగానే గ్యాస్ ను రూ.500 కే ఇస్తాం. చీతాలు తెచ్చి ఫొటోలు దిగి మోడీ గొప్పలకు పోతున్నారు. చీతాలు తీసుకురావడమేనా మీరు సాధించింది. మీ నాయకులు వాజ్ పేయి, అద్వానీ ఉండగా వల్లభాయ్ పటేల్ అంబేద్కర్ ఫొటోలు పెడుతున్నారంటూ చింతా మోహన్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications