మోడీ సహకారం! ఆ తర్వాతే విశాఖ నుండి హైద్రాబాద్ వెళ్లా: బాబు

ఏలూరు: ఒక ఆలోచన విధానంతో ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు వెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. కేంద్రం మనకు చాలా సహకరిస్తోందన్నారు. తాను ప్రజల సహకారంతో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిస్తానని చెప్పారు. పోలవరం వల్ల ఏపీకి ఎంతో ఉపయోగముంటుందన్నారు. పోలవరం వల్ల రెండో పంటకు సమస్య ఉండదని చెప్పారు.

ఇటీవల భయంకర తుఫానులో విశాఖ పూర్తిగా నష్టపోయిందని, విశాఖలో పరిస్థితి సద్దుమణిగాకే తాను హైదరాబాదుకు వెళ్లానని చెప్పారు. దొంగలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సమర్థ పాలన అందిస్తామన్నారు. పేదలు, రైతులకు అండగా ఉంటామని చెప్పారు.

రాష్ట్రంలో అపార వనరులు ఉన్నాయన్నారు. శ్రీకాకుళం నుండి ఎస్పీఎస్ నెల్లూరు వరకు తీర ప్రాంతం ఉందని చెప్పారు. ఇలా ఎక్కడా లేదన్నారు. రాబోయే రోజుల్లో ఏ రైతు కూడా నష్టపోకూడదన్నారు. వ్యవసాయంలో భూసార పరీక్షలతో పాటు ఆధునిక పద్ధతులు అవలంభించాలన్నారు. కొల్లేరు సరస్సును మానవా దృక్పథంతో చూడాల్సిన అవసరమన్నారు.

Central Government helping to AP: Chandrababu

గత ఇరవై ఏళ్ల సరాసరి చూస్తే మూడువేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతోందన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పారు. అన్ని సమస్యలను తీర్చాల్సి ఉందన్నారు. రుణమాఫీ కోసం ఎంతో కసరత్తు చేశామన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కైకరంలోని రైతు సదస్సులో మాట్లాడారు.

ఇంత రుణమాఫీ దేశంలో ఎక్కడా లేదు: స్పీకర్ కోడెల

దేశంలో రూ.40వేల కోట్ల రుణమాఫీ ఇంత భారీగా చేయడం ఎక్కడా లేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. అయితే, రుణమాఫీలో కొన్ని సమస్యలున్నాయన్నారు. బ్యాంకులు, రైతుల్లో నెలకొన్న సమస్యలు నివృత్తి చేయాల్సి ఉందన్నారు. ఎస్పీఎస్ నెల్లూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ మాట్లాడారు.

రాష్ట్రంలో అనేక సమస్యలున్నా చంద్రబాబు అద్భుతంగా పని చేస్తున్నారని కోడెల ప్రశంసించారు. ఈ నెల 18 నుంచి శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. రుణమాఫీ, కొత్త రాజధాని నిర్మాణంపై చర్చ సమావేశాల్లో జరుగుతుందన్నారు. రాష్ట్ర అఢివృద్ధికి అసెంబ్లీని మంచి వేదికగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

మోడీని చూసి నేర్చుకోవాలి: వడ్డె

ప్రధాని నరేంద్ర మోడీని చూసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేర్చుకోవాలని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వర రావు వేరుగా అన్నారు. రాజధాని నిర్మాణం పైన స్పష్టత ఇవ్వాలన్నారు. రాజధాని విషయంలో ప్రతి అంశాన్ని ఆయన ప్రజలకు చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+