• search
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సాధ్యం కాదు: ఆస్తుల పంపకం, విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం

|

న్యూఢిల్లీ/అమరావతి: విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని మార్చి 12న జరిగిన రైల్వే శాఖ అధికారుల సమీక్ష సమావేశంలోనే చెప్పారని తెలిపింది. రాష్ట్ర విభజన చట్టంపై సుప్రీంకోర్టులో శుక్రవారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్ర హోంశాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల ఆస్తులను పంచాల్సిన అవసరం లేదంది. ఏపీ పునర్విభజన చట్టంపై ఈ ఏడాది మూడు సార్లు భేటీ అయ్యామని, షెడ్యూల్‌ 10 ప్రకారం కేంద్ర సంస్థలు ఏ ప్రాంతంలో ఉన్నాయో.. అక్కడే కొనసాగుతాయని, అంతే తప్ప ఆస్తుల పంపకం చేయమని కేంద్రం తెలిపింది.

Central government on Visakha railway zone issue.

షెడ్యూల్‌ 10 కింద రెండు తెలుగు రాష్ట్రాల్లో 142 సంస్థలున్నాయని చెప్పింది. అయితే 13వ షెడ్యూల్‌ కింద ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థను ఏపీలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యక​త ఉందని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. పదో షెడ్యూల్‌లోని ఉన్నత విద్యా మండలి కేసు సందర్భంలో సంస్థల విభజనతో పాటు ఆస్తులు కూడా జనాభా ప్రాతిపదికన పంచాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఏపీ పునర్విభజన చట్టంలోని 53వ సెక్షన్‌ ప్రకారం.. రెండు రాష్ట్రాల్లో వాణిజ్య, పారిశ్రామిక ఆస్తులు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఏ ప్రాంతంలో ఉంటే, ఆ రాష్ట్రానికే చెందుతాయని తెలిపింది. ఉద్యోగుల పంపిణీ విషయంలో కేంద్రానిదే తుది నిర్ణయని కూడా తేల్చి చెప్పింది.

కాగా, నూతన మెట్రో విధానానికి అనుగుణంగా ఉంటేనే విజయవాడలో మెట్రోకు ఆమోదం తెలుపుతామని హోంశాఖ స్పష్టంచేసింది. ఇప్పటివరకు రూ.15వేల కోట్ల ఖర్చులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యూసీలు సమర్పిచిందని వెల్లడించింది.

వివిధ శాఖలకు సంబంధించిన 753 మంది ఉద్యోగుల విభజన పెండింగ్‌లోనే ఉందని, అనేక సంస్థల ఏర్పాటు ఇంకా డీపీఆర్‌, ఆమోదం దశలోనే ఉన్నాయని వెల్లడించింది. పలు వివాదాస్పద అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదంది. ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే పలు అంశాల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని అఫిడవిట్‌లో తెలిపింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

మరిన్ని అమరావతి వార్తలుView All

English summary
Central government responded on Visakha railway zone issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more