ఏపికి కేంద్రం తిత్లీ సాయం : రూ. 539.53 కోట్ల మంజూరు..
తిత్లీ తుఫాను కారణంగా ఏపిలో జరిగిన నష్టం పై కేంద్రం స్పందించింది. ఏపి ప్రభుత్వం తిత్లీ తుఫాను కారణంగా దాదాపు మూడు వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని కేంద్రానికి నివేదించింది. కేంద్ర బృందం సైతం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కేంద్రానికి నివేదించింది. అయితే, ఏపి ప్రభుత్వం వద్ద ఉన్న కేంద్ర విపత్తు నిధులను తొలుత వినియోగంచుకోవాలని సూచించింది. తాజాగా, ఏపి ప్రభుత్వానికి రూ. 539.53 కోట్లు అదనంగా ఇవ్వాలని నిర్ణయించింది.
తిత్లీ తుఫాన్‌తో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకొచ్చింది. తిత్లీ తుఫాన్‌తో శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిత్లీ తుఫాన్ సాయం కింద ఏపీకి రూ.539.53 కోట్లు అదనంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇక, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న కేరళ రాష్ట్రానికి రూ. 3050 కోట్ల అదనపు సాయాన్ని అందజేయనుంది.

ఈ మేరకు ప్రతిపాదనలకు కేంద్ర హోంశాఖ హైలెవల్ కమిటీ ఆమోదిం చింది. గత అక్టోబర్ నెలలో సంభవించిన తిత్లీ తుఫాన్ ధాటికి శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. జిల్లాలో తుఫాన్ తీవ్రమైన విధ్వంసాన్ని మిగిల్చింది. జిల్లాలోని అనేక చోట్ల తుఫాన్ ధాటికి జనజీవనం అస్తవ్యస్త మైంది. పెద్దసంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
తీత్లి బాధితులు చాలామంది ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. దీని పై రాజకీయంగానూ విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం తిత్లీ తుఫాను నష్టం పై పట్టించుకోవటం లేదని..ఏపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. తాజాగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం పై ఏరకంగా స్పందిస్తుందో చూడాలి.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications