ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక, కీలక నిర్ణయం..!?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిల ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది. దసరా సమయంలోనే ఈ మేరకు ప్రకటన ఉంటుందని భావించారు. అయితే, ఈ సారి జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. ఈ సారి పెంపు మూడు శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు. దీంతో.. ఉద్యోగుల డీఏ చెల్లింపు మొత్తం 63 శాతానికి చేరనుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రానున్న దీపావళి కానుకగా 3 శాతం డీఏ పెరిగే అవకాశం ఉంది. జూలై 1, 2026 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ పెంపుపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈసారి డీఏ 3 శాతం పెరిగి 60 శాతం నుంచి 63 శాతానికి చేరవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ పెంపు జూలై 1 నుంచి అమలైతే, ఆ తేదీ నుంచి వర్తించే బకాయిలు కూడా ఉద్యోగులకు అందే అవకాశం ఉంది. .18వేల కనీస వేతనం ఉన్న ఉద్యోగికి నెలకు రూ.540 అదనంగా పొందవచ్చు. అంటే ఏడాదికి రూ.6,480 బెనిఫిట్ ఉంటుంది. అదే రూ.25,500 కనీస వేతనానికి నెలకు రూ.765, ఏడాదికి రూ.9,180 అదనంగా అందవచ్చు. కాగా.. వచ్చే కేబినెట్ భేటీలో ఈ డీఏ ఖరారు పైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

సుప్రీం ఆదేశాలతో, ఆ 19 మున్సిపాల్టీల్లో - SEC కీలక నిర్ణయం, డెడ్ లైన్..!!
సుప్రీం ఆదేశాలతో, ఆ 19 మున్సిపాల్టీల్లో - SEC కీలక నిర్ణయం, డెడ్ లైన్..!!
central-govt-employees-and-pensioners-hopes-on-da-hike-in-next-union-cabinet-meeting-here-the-deta

కేబినెట్ లో నిర్ణయం

ఉద్యోగ సంఘాలు పెండింగ్ డీఏ, డీఆర్‌తో పాటు దీపావళి బోనస్‌ను త్వరగా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు 30 రోజుల తాత్కాలిక బోనస్, రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది. దీంతో, ఈ సారి జరిగే కేబినెట్ భేటీలో డీఏ పైనా నిర్ణయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. డీఏ పెంపు నిర్ణయం వల్ల 63 శాతం డీఆర్‌తో పెన్షన్‌దారుల నెలవారీ ఆదాయం కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపును ఆమోదిస్తే, నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌లోనూ సమాన శాతం పెంపు ఉండవచ్చని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+