విశాఖ వాసులకు శుభవార్త.. అక్కడ మరో కొత్త మెడికల్ కాలేజ్ ఇస్తున్న కేంద్రం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన పైన దృష్టి సారించి రోడ్లు, రవాణా సదుపాయాలకు భారీ బడ్జెట్లను కేటాయించిన కేంద్రం ఏపీలో వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో ఉన్న ఈ ఎస్ ఐ ఎస్ ఆస్పత్రిని మెడికల్ కళాశాలగా అప్గ్రేడ్ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆ ఆస్పత్రి మెడికల్ కాలేజ్ గా అప్ గ్రేడ్

విశాఖపట్నంలో ఉన్న ఈ ఈఎస్ఐఎస్ ఆసుపత్రి అప్గ్రేడ్ చేయడం ద్వారా మరో కొత్త మెడికల్ కళాశాల ఏపీకి రానుంది. వైద్య విద్యను, ప్రజారోగ్య సేవలను విస్తరించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రధానంగా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఈఎస్ఐ, ఈఎస్ఐఎస్ ఆసుపత్రులను మెడికల్ కళాశాలలుగా మార్చడానికి కేంద్రం కసరత్తు చేస్తున్న క్రమంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నంలోని ఈఎస్ఐఎస్ ఆస్పత్రికి ఆ అవకాశం లభించింది.

central govt said good news to visakha people ESIS hospital upgradation as medical college in vizag

ఈఎస్ఐసి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు కార్యరూపం

రాష్ట్ర బీమా సంస్థ అయిన ఈఎస్ఐసి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందని భావిస్తున్నారు. ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో కేంద్ర కార్మిక సహాయ మంత్రి శోభ కరందాజ్లే ఈ విషయంపైన స్పష్టత నిచ్చారు. జాతీయ వైద్య మండలి నిబంధనలకు అనుగుణంగా విశాఖపట్నంలోని ఈ ఎస్ ఐ ఎస్ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తున్నామని ఆమె రాజ్యసభ వేదికగా ధ్రువీకరించారు.

కేంద్రానికి అప్పగించే ప్రక్రియ మొదలుపెట్టిన ఏపీ సర్కార్

రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రిని అప్పగించిన వెంటనే తదుపరి చర్యలు ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే ఈఎస్ఐఎస్ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. ప్రస్తుతం సిబ్బంది, నిర్వహణ ఖర్చులు, ఇతర కీలక అంశాలపైన కేంద్రంతో చర్చలు సాగుతున్నాయి. ఈ అప్ గ్రేడేషన్ పనుల కోసం జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వ బృందం విశాఖపట్నంలోని ఈఎస్ఐఎస్ ఆసుపత్రిని సందర్శించి పరిశీలన జరిపింది.

విశాఖపట్నం వాసులకు గుడ్ న్యూస్

ప్రస్తుతం 200 పడకలతో కొనసాగుతున్న ఈ ఆసుపత్రి మెడికల్ కళాశాల గా మారడం విశాఖపట్నం వాసులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇది మాత్రమే కాదు షీలా నగర్ లో 400 పడకలతో మరో అత్యాధునిక యేసయ్య ఆసుపత్రి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుంది. ఇది కూడా విశాఖ వాసులకు శుభవార్త అనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+