మిథున్‌రెడ్డికి అదిరిపోయే షాక్ ఇచ్చిన రామ్మోహన్‌నాయుడు!

కాలగమనంలో ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ దీన్ని మరిచి అన్ని రోజులు తమవే అని ఎగిరెగిరి పడితే తిరిగి లేవలేనిరీతిలో నేలకు కరుచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఉపమానం రాజంపేట నుంచి ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డికి వర్తిస్తుంది. 2023 సెప్టెంబరు 9వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. వైఎస్ జగన్ ప్రభుత్వం బాబును అరెస్ట్ చేసి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచింది.

రేయ్.. అని పిలిచాడు
దీనిపై రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో ప్రస్తావన చేస్తున్న సమయంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రామ్మోహన్‌ను అవమానించారు. ఉన్నది లోక్ సభలోనే అనే విషయాన్ని మరిచిపోయి సహచర సభ్యుడైన రామ్మోహన్ నాయుణ్ని రేయ్ అని సంభోదిస్తూ.. మాట్లాడింది చాల్లే కూర్చో అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం అని, లోక్ సభలో ఎక్కువమంది సభ్యులున్నారనే అధికార దర్పంతో తోటి ఎంపీని అలా ప్రస్తావించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రోజులు గడిచిపోయాయి.. తిరిగి ఎన్నికలు వచ్చాయి. అధికార వైసీపీని ప్రజలు నేలకేసి కొట్టారు. 11 అసెంబ్లీ స్థానాలు, నాలుగు ఎంపీ స్థానాలకు కుదేలైంది.

central minister rammohan naidu heavy shock to rajampet ycp mp mithun reddy

షర్మిల లేకపోతే కడప కూడా గెలిచేవారు
బీజేపీ ఆరు సీట్లు ఇవ్వకుండా మూడు సీట్లిచ్చి మరో మూడు సీట్లలో తెలుగుదేశం, జనసేన పోటీచేసినా సరిపోయేదని, అప్పుడు వైసీపీకి ఒక ఎంపీ సీటు దక్కేదని ప్రజలు అంటున్నారు. చివరకు ఆ ఒక్క ఎంపీ సీటు కడప కూడా వచ్చేదికాదని, షర్మిల లక్ష ఓట్లకు పైగా చీల్చిందని, షర్మిల లేకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందేవాడంటున్నారు.

కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి 164 శాసనసభ నియోజకవర్గాలను, 21 లోక్ సభ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ తరఫున రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ సాధించి కేంద్ర మంత్రి అయ్యారు. వయసులో తనకన్నా పెద్దవాడైనా మిథున్ రెడ్డి ఎంపీగానే మిగిలిపోయాడు. జీవితంలో కేంద్ర మంత్రి కాదుకదా.. ఎంపీ అవడం కూడా కష్టమేనని అతని నియోజకవర్గ ప్రజలే అంటున్నారు. రేయ్ అని పిలిచిన మిథున్ రెడ్డి అలాగే ఉండిపోగా, అవమానానికి గురైన రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి అయ్యారు. మిథున్ రెడ్డికి రామ్మోహన్ అదిరిపోయే షాక్ ఇచ్చాడని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+