కాకినాడ ప్రయాణికులకు రైల్వే అలర్ట్..! ఆ రెండు రైళ్ల సమయాల్లో..!

కాకినాడ ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్ జారీ చేసింది. కాకినాడ నుంచి సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న ప్రాంతాలకు ప్రయాణించే రెండు రైళ్ల రాకపోకల్లో రేపు ఒక్కరోజు మార్పులు చోటు చేసుకోనున్నాయి. సెంట్రల్ రైల్వే పరిధిలో జరుగుతున్న మెయింటెనెన్స్ పనుల కారణంగా వందే భారత్ లతో పాటు పలు రైళ్ల సమయాల మార్పు, మళ్లింపులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో కాకినాడ నుంచి రాకపోకలు సాగించే రెండు రైళ్లు కూడా ఉన్నాయి.

కాకినాడ నుంచి ముంబై లోక్ మాన్య తిలక్ టెర్మినల్ కు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17221తో పాటు లోక్ మాన్య తిలక్ టెర్మినల్ నుంచి కాకినాడ పోర్టుకు వచ్చే ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17222 రాకపోకల్లో రేపు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే కచ్చితంగా ఎంత సమయం లేట్ అవుతుందో తెలియకపోయినా ఈ రెండు రైళ్లలో ప్రయాణికులకు ఆలస్యం మాత్రం తప్పేలా లేదు. రెండు వైపులా వెళ్లే ట్రైన్లు మధ్యలో మళ్లింపులు చేపడుతున్నారు. దీంతో ఈ ఆలస్యం జరిగే అవకాశం ఉంది.

Central Railway Mega Block Tomorrow Several Kakinada Trains to Face Disruptions

సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న సీఎస్ఎంటీ నుంచి చునాభట్టీ, బాంద్రా డీఎన్ హార్బర్ లైన్ లో ప్రయాణించే రైళ్లకు ఉదయం 11.40 నుంచి సాయంత్రం 4.40 వరకూ బ్లాక్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే చునాభట్టీ-బాంద్రా నుంచి సీఎస్ఎంటీ లైన్ కు ఉదయం 11.10 నుంచి సాయంత్రం 4.10 వరకూ బ్లాక్ ఉంటుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ మార్గంలో వెళ్లే రైళ్ల సమయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఈ రైళ్లలో ప్రయాణించే వారు రైల్వే యాప్ లేదా వెబ్ సైట్ లో లైవ్ సమయాలను చూసుకుని ప్రయాణాలు సాగించాల్సి వస్తుంది.

Central Railway Mega Block Tomorrow Several Kakinada Trains to Face Disruptions

ముంబై డివిజన్ ఆదివారం అనగా 19.10.2025 నాడు వివిధ ఇంజనీరింగ్ మరియు నిర్వహణ పనులను నిర్వహించడానికి విద్యావిహార్ మరియు థానే స్టేషన్ల మధ్య 5వ మరియు 6వ లైన్లలో దాని ప్రధాన లైన్ సబర్బన్ విభాగాలలో మెగా బ్లాక్‌ను చేపడుతుందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ స్వప్నిల్ నీలా తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+