విశాఖపట్నంకు శుభవార్త

దీపావళి, ఛత్ పండగల సందర్భంగా ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈనెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తూర్పు కోస్తా రైల్వే పరిధిలో విశాఖపట్నం నుంచి దానాపూర్ మధ్య ప్రత్యేక రైలును, విశాఖపట్నం-భువనేశ్వర్-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.

నవంబరు నాలుగోతేదీ ఉదయం 9.10 గంటలకు విశాఖ-దానాపూర్ 08520 ప్రత్యేక రైలు విశాఖలో బయలుదేరుతుంది. తర్వాత రోజు ఉదయం 11.00 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబరు 5వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు దానాపూర్ లో 08519 బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 2.42 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలులో 3 థర్డ్‌ ఏసీ, 12 స్లీపర్, 5 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్, 2 సెకండ్‌ క్లాస్‌ బోగీలు, దివ్యాంగుల బోగీ ఉంటుంది.

central railway ministry good news for visakhapatnam

అలాగే విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ మధ్య తిరిగే రైలు అన్ రిజర్వుడు రైలు. నవంబరు 15వ తేదీ మధ్యాహ్నం 08535 ప్రతిరోజు రాత్రి 10.30 గంటలకు భవనేశ్వర్ లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. నవంబరు 15వ తేదీ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 12.00 గంటలకు 08536 విశాఖపట్నంలో బయలుదేరి అదేరోజు రాత్రి 7.45 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఈ రైలు లో 10 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్, దివ్యాంగులకు ఒకబోగీ, ఒక మోటార్‌ కార్‌ బోగీ ఉంటుంది.

central railway ministry good news for visakhapatnam

ఇవే కాకుండా దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ - నిజాముద్దీన్‌‌‌‌, నాందేడ్‌‌‌‌ - -పానిపట్‌‌‌‌, నాందేడ్‌‌‌‌ - -పాట్నా, ఛాప్రా- -యశ్వంత్‌‌‌‌పూర్‌‌‌‌, చెన్నై - అంబాలా కంటోన్మెంట్‌‌‌‌ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటికోసం గుంటూరు, విజయవాడ, తిరుపతి, కాచిగూడ, హైదరాబాద్, సికింద్రాబాద్ తదితర స్టేషన్లలో అదనపు సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. పండగల సందర్భంగా రైళ్లల్లో జనరల్ బోగీల కోసం రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులకు కొన్ని స్టేషన్లలో క్యూ పద్ధతిని ఏర్పాటు చేశారు. వారిని క్యూలో ఉంచి బోగీలోకి పంపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+