ఎన్నికల వేళ సీఎం జగన్ కు కేంద్రం గుడ్ న్యూస్, ఫలించిన నిరీక్షణ..!!
ముఖ్యమంత్రి జగన్ కు కేంద్రం నుంచి వరుసగా అనుకూల నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఎన్నికల ఏడాదిలో కేంద్రం పెండింగ్ వినతులను పరిష్కరిస్తోంది. 2014 -15 రెవిన్యూ లోటు కోసం నాటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి దక్కించుకోవటానికి అనేక ప్రయత్నాలు చేసింది. కానీ, కేంద్రం విడుదల చేయలేదు. ఇప్పుడు సీఎం జగన్ అభ్యర్ధనతో ఆ నిధులు విడుదల అయ్యాయి. ఇదే సమయంలో పోలవరం నిధులపై కీలక సమాచారం అందుతోంది.
పోలవరం నిధులకు ఆమోదం : రాష్ట్ర విభజన సమయంలో పోలవరంను కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. మొత్తం ఖర్చు కేంద్రమే భరించేలా నిర్ణయం జరిగింది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హాయంలో రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్వహణా బాధ్యతలు తీసుకుంది. కేంద్రం నుంచి ఆ మొత్తాన్ని రీయంబర్స్ చేసేలా నిర్ణయించారు.

కానీ,విభజన జరిగి తొమ్మిదేళ్లు పూర్తయింది. ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ప్రాజెక్టు సవరంచించిన అంచనాలు.. పునరావాసం నిధుల పైన కేంద్రం - రాష్ట్రం మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం జగన్ సమావేశమయ్యారు. సవరించిన అంచనా మేరకు ముందుగా అడహక్ నిధులు విడుదల చేయాలని కోరారు.
త్వరలో ఏపీకి రూ 17 వేల కోట్లు : తాజాగా జలశక్తి మంత్రి పోలవరం పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2025 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం తాజా సమీక్షలో వెల్లడించింది. ఈ సమీక్షలో తక్షణం నిధుల కింద రూ 17,144 కోట్లు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీని పైన కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు ఇదే విషయం పైన ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కీలక ప్రకటన చేసారు.
త్వరలో రూ. 12వేల కోట్లకుపైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిర్మాణం కోసం రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోందన్నారు. దీని వల్ల 41.15 ఎత్తులో నీటి నిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులను ఇవ్వనుందని చెబుతూ.., తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మత్తుల నిమిత్తం రూ. 12,911 కోట్లను కేంద్రం ఇస్తుందని వెల్లడించారు.

కేంద్రం నిర్ణయాలతో భారీ రిలీఫ్ : దీనిపై త్వరలో కేంద్ర కెబినెట్లో నిర్ణయం తీసుకోబోతోందని జీవీఎల్ స్పష్టం చేసారు. రెవెన్యూ డెఫిసిట్ కింద కేంద్రం రూ. 10 వేల కోట్లు ఇచ్చిందని జీవీఎల్ తెలిపారు. స్పెషల్ ఇన్సెంటీవ్స్ ప్యాకేజీ రూపంలో రూ. 10 వేల కోట్లకు పైగా నిధులిచ్చిందన్నారు. ఎన్నికల ఏడాదిలో అటు సంక్షేమం..ఇటు పెండింగ్ బకాయిల చెల్లింపుతో పాటుగా పలు కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ సమయంలో కేంద్రం నుంచి ముఖ్యమంత్రి జగన్ కు రిలీఫ్ ఇచ్చే నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఆర్దికంగా కేంద్రం నుంచి వస్తున్న వరుస ప్రకటనలతో ఏపీ ప్రభుత్వానికి ఉపశమనం కలుగుతోంది. పోలవరం నిధులు విడుదల అవుతే, ఎన్నికల వేళ ప్రాజెక్టు నిర్మాణం లో పురోగతి రాజకీయంగానూ సీఎం జగన్ కు మేలు చేసే అంశంగా భావిస్తున్నారు.
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications