బాబు, కేసీఆర్‌లకు మోడీ ఊరట: ఢిల్లీ ఇచ్చిన విద్యుత్ టీ, ఏపీలకు

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉరటను ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలు భారీ విద్యుత్ కోతతో అల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాలకు అదనపు విద్యుత్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది.

తెలంగాణకు 222, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 304, కేరళకు 167 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను కేటాయించింది. ఢిల్లీ వెనక్కి ఇచ్చిన విద్యుత్‌ను కేంద్రం ఈ మూడు రాష్ట్రాలకు ఇచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ కేటాయింపులు ఉంటాయి.

Centre gives additional power to AP and Telangana

అక్టోబర్ 1వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన విద్యుత్ కూడా తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు కేటాయిస్తారు. మొత్తం 693 మెగావాట్ల విద్యుత్‌ను ఈ మూడు రాష్ట్రాలకు కేటాయిస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+