ఏపీ హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్- కేంద్రం నోటిఫై
అమరావతి: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు. ప్రస్తుతం బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తోన్నారు. ఆయనకు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసులను తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయన నియామకాన్నినోటిఫై చేసింది.
తెలంగాణతో పాటు ఏపీ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం రెకమెండ్ చేసిన విషయం తెలిసిందే. బోంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించాలని సూచించింది. ఇది వరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పీకే మిశ్రా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.

దీనితో ఖాళీ అయిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానాన్ని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో భర్తీ చేసింది. ఆయన స్వరాష్ట్రం జమ్మూ కాశ్మీర్. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత ఏడాది జూన్‌లో బోంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇదివరకు ఆయనను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ కొలీజియం సిఫారసు చేసింది గానీ దాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయలేదు. పెండింగ్‌లో ఉంచింది.
అందులో మార్పులు చేసింది కొలీజియం. మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను నియమించాలంటూ చేసిన సిఫారసులను సవరించింది. మణిపూర్‌కు బదులుగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సూచించింది. తాజాగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దీనిపై ఆమోదం తెలిపింది.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియామకాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీందర్ కశ్యప్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరాధే.. ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.












Click it and Unblock the Notifications