పవన్ కల్యాణ్ చెప్పారు: అయినా చేతులేత్తేసిన కేంద్రం
అమరావతి: ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తి, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కృషి వృధా అయింది. కేంద్రం చేతులెత్తేసింది.
Recommended Video

ఆ మేరకు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓ లేఖ వచ్చినట్లు సమాచారం. ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, అకడమిక్ డిఎంఈ, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ అప్పలనాయుడు గత వారం ఢిల్లీలో మూడు రోజుల పాటు ఉండి కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో, ఎంసిఐ అధికారులతో, న్యాయనిపుణులతో చర్చలు జరిపారు.

వారు ఇలా చెప్పారు...
కావాలంటే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసుకోవచ్చునని ఎంసిఐ తేల్చి చెప్పింది. ఆ పిల్‌ను సుప్రీంకోర్టు స్వీకరించి, విద్యార్థులకు ఒకవేళ అనుకూలంగా తీర్పు ఇస్తే తాము గౌరవిస్తామని ఎంసిఐ చెప్పింది. అంతకు మించిన హామీ దాని నుంచి రాలేదు. దాంతో అధికారులు వెనక్కి వచ్చేశారు.

మూడు ప్రత్యామ్నాయాలతోరాష్ట్ర ప్రభుత్వం
ఎంసిఐ చేతులెత్తేయడంతో మూడు ప్రత్యామ్నాయాలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తొమ్మిది సీట్ల చొప్పున పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని, వాటిలో ఫాతిమా కాలేజీ విద్యార్థులకు సీట్లు ఇస్తామని చెప్పింది. అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మొదటి ప్రత్యామ్నాయం

మిగతారెండు ప్రత్యామ్నాయాలు ఇవీ...
వచ్చే ఏడాది, అంటే 2018లో రాష్ట్రానికి కేటాయించే సీట్లల్లో 100 సీట్లు వారికి కేటాయించడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. వచ్చే ఏడాది ఫాతిమా కాలేజీకి కేటాయించే సీట్లలో 100 సీట్లు బ్లాక్ చేసి, వాటిలో ఇప్పుడున్న విద్యార్థులకు అవకాశం కల్పించాలని కోరింది. ఆ అఫిడవిట్‌ను తిరస్కరిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

ఇలా చేయాలని రాష్ట్రం
ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసి ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలనే యోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. దీన్నే ఫాతిమా విద్యార్థులు మొదటి నుంచీ కోరుతున్నారు. ఆర్డినెన్స్ జారీపై ఆరోగ్య శాఖ పరిశీలిస్తోంది. ఆర్డినెన్స్ ద్వారా వారికి న్యాయం చేయడానికి గల సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తోంది. చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇందుకు సంబంధించిన విషయాలపై చర్యలు తీసుకుంటారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications