పాత పాటేనా: ఎపికి రూ. 1269 కోట్లు విడుదల చేసిన కేంద్రం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: వివిధ అంశాల కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 1,269 కోట్లు విడుదల చేసింది. బిజెపికి, తెలుగుదేశం పార్టీకి మధ్య సంబంధాలు బెడిసికొట్టే ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కేంద్రం ఈ నిధులు విడుదల చేసింది.

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.41744 కోట్లు విడుదల చేసింది. ఇరు పార్టీల మధ్య విభేదాలకు ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టు కూడా ఓ కారణమనే విషయం తెలిసింది. 2014 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన ొత్తం ఇది.

Centre releases Rs 1269 crore for Andhra Pradesh projects

ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ ఆర్పిఎస్ శర్మ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారితీ ద్వారా కేంద్రం ఇప్పటి వరకు రూ.4,329 కోట్లు విడుదల చేసింది. అయితే, తాము రూ.7,200 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

పోలవరంపై తాము ఖర్చు చేసిన సొమ్ములో ఇంకా రాష్ట్రానికి రూ.3,217.63 కోట్లు రావాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించిన మెమొరాండంలో తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Centre has released a sum of Rs 1,269 crore to Andhra Pradesh under different heads in the last few days amid a strain in ties between the NDA and its ally TDP over allocation given to the state in the Union Budget.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి