జగన్ కు కేంద్రం గుడ్ న్యూస్-అప్పుల పుట్ట వేళ ఊరట-పంచుకున్న సోము వీర్రాజు

అప్పుల ఊబిలో కూరుకుపోయిన వైసీపీ సర్కార్ కు కేంద్రం ఇవాళ మరో ఊరటనిచ్చే వార్త చెప్పింది. విభజన తర్వాత రెవెన్యూ లోటుతో సతమతం అవుతూ.. అఫ్పులతోనే కాలం వెళ్లదీస్తున్న వైసీపీ సర్కార్ కు కేంద్రం అందించిన వార్త ఊరటనిచ్చింది. ఇప్పటికే బీజేపీ నేతల ఫిర్యాదుల నేపథ్యంలో జగన్ సర్కార్ అప్పులపై ఆగ్రహంగా ఉన్న కేంద్రం.. ఈ నిధులు విడుదల చేయడం ప్రాదాన్యం సంతరించుకుంది. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు స్వయంగా ట్వీట్ చేసి పంచుకున్నారు. అయితే ఇందులో ఆయన ఇచ్చిన వివరాలు తప్పుగా ఉన్నాయి.

 అప్పుల ఊబిలో ఏపీ

అప్పుల ఊబిలో ఏపీ

విభజనతో నష్టపోయిన ఏపీలో అప్పుల చిట్టా రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అభివృద్ధి కోసం రూపాయి కూడా అదనంగా ఖర్చు పెట్టే పరిస్ధితి లేదు. దీంతో వైసీపీ సర్కార్ ఆర్ధిక వ్యవహారాల్లో దినదినగండంగా గడుపుతోంది. ఇప్పటికే అప్పులు తెచ్చేందుకు దారులన్నీ మూసుకుపోవడం, కేంద్రం నుంచి పైసా కూడా ఆర్ధిక సాయం అందకపోవడం, అదే సమయంలో బహిరంగ మార్కెట్లో తమ పరపతితో అప్పులు తెచ్చుకుందామన్న కేంద్రం ఆంక్షలు విధిస్తుండంతో ప్రభుత్వ పరిస్ధితి నానాటికీ దిగదారుతోంది. దీంతో కొత్త అప్పులు తెచ్చేందుకు ప్రతీరోజూ వైసీపీ సర్కార్ దారులు వెతుక్కోవాల్సిన పరిస్దితి నెలకొంటోంది.

 పెరిగిపోతున్న రెవెన్యూ లోటు

పెరిగిపోతున్న రెవెన్యూ లోటు

ఏపీలో విభజన నాటికి ఉన్న రెవెన్యూ లోటు దాదాపు రూ.16 వేల కోట్లు. అది ఇప్పుడు చాంతాడులా పెరిగిపోయింది. దీంతో ఉన్న సమస్యలకు తోడు రెవెన్యూ లోటును కూడా భరించాల్సిన పరిస్దితి వైసీపీ ప్రభుత్వానికి ఎదురవుతోంది. అయితే విభజన హామీల్లో భాగంగా ఏపీ రెవెన్యూ లోటు తీరుస్తామని హామీ ఇచ్చిన కేంద్రం.. ఏటా విడుదల చేస్తున్న మొత్తాలు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో రెవెన్యూ లోటు భారీగా పెరుగుతూ పోతోంది. కేంద్రం ఇస్తున్న మెత్తాలు కూడా సకాలంలో రాకపోవడంతో ఏపీపై భారం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా రెవెన్యూ లోటు భర్తీని ప్రస్తావిస్తూనే ఉన్నారు.

 రూ.1438 కోట్లు విడుదల చేసిన కేంద్రం

రూ.1438 కోట్లు విడుదల చేసిన కేంద్రం

రెవెన్యూ లోటుతో సతమతం అవుతున్న ఏపీకి కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.1438 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు రెవెన్యూ లోటు మొత్తాలను విడుదల చేసిన కేంద్రం.. ఇందులో ఏపీకి రూ.1438 కోట్లు కేటాయించింది. అత్యధికంగా కేరళకు 1657 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. ఆ తర్వాతి స్దానంలో పశ్చిమబెంగాల్ కు సైతం రూ.1467 కోట్లు విడుదల చేసింది. విపక్షాల ప్రభుత్వాలు ఉన్న ఈ రెండు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి విడుదల చేసిన రూ.1438 కోట్లు మూడో స్ధానంలో మాత్రమే ఉన్నాయి. దీంతో రెవెన్యూ లోటు భర్తీలో ఏపీ కనీసం మూడో స్ధానం దక్కించుకున్నట్లయింది.

 అప్పుల వేళ జగన్ సర్కార్ కు ఊరట

అప్పుల వేళ జగన్ సర్కార్ కు ఊరట

నిత్యం అప్పులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వైసీపీ సర్కార్ కు రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్ర ప్రభుత్వం రూ.1438 కోట్లు కేటాయించడం భారీ ఊరటనిస్తోంది. ఎందుకంటే ఉద్యోగాలు జీత భత్యాలు, పెన్షన్ల చెల్లింపులకూ సరిపోయే మొత్తాలు లేని పరిస్ధితుల్లో ఎప్పటికప్పుడు అప్పుల్లో మునిగితేలుతున్న ప్రభుత్వానికి కేంద్రం రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.1438 కోట్లు కేటాయించడం ఊరటనిచ్చే విషయమే. అయితే అదే సమయంలో కేరళ, బెంగాల్ తర్వాత స్ధానంలో ఏపీకి ఈ మొత్తం ఉండటం చర్చనీయాంశమైంది. దీంతో అధికారుల నివేదికల మేరకు కేంద్రం ఈ రెవెన్యూ లోటు భర్తీ చేసినట్లు తెలుస్తోంది.

 సోము వీర్రాజు రాంగ్ ట్వీట్

సోము వీర్రాజు రాంగ్ ట్వీట్

కేంద్ర ప్రభుత్వం ఏపీకి విభజన సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం రెవెన్యూలోటును భర్తీ చేయాల్సి ఉంది. అది భర్తీ కాకపోగా.. అప్పుడప్పుడు విడుదల చేస్తున్న నిధుల కారణంగా ఈ లోటు ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో నిధులు విడుదల కాగానే కేంద్రాన్ని పొగుడుతూ ఏపీ బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. విభజన హామీ అయిన రెవెన్యూ లోటును పూర్తిగా ఇవ్వకుండా విడతల వారీగా ఇస్తున్న నేపథ్యంలో సోము వీర్రాజు దీన్ని కేంద్రం గొప్పగా చెప్పుకుంటూ ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. అదే సమయంలో సోము వీర్రాజు ఏపీకి అత్యధికంగా రూ.1438 కోట్లు కేటాయించినట్లు చేసిన ట్వీట్ కూడా తప్పులతడగకానే ఉంది. రెవెన్యూ లోటు భర్తీ జాబితాలో మనకంటే ముందున్న కేరళ, బెంగాల్ ను వదిలి ఏపీకి అత్యధికంగా లబ్ది చేకూరినట్లు సోము చేసిన ట్వీట్ తప్పేనని తేలిపోయింది. అదే సమయంలో ఈ ఏడాది ఏపీకి రూ.7190 కోట్లు ఇచ్చినట్లు సోము ప్రకటించడం విశేషం.

 చెత్తబుట్టలోకి బీజేపీ ఫిర్యాదులు

చెత్తబుట్టలోకి బీజేపీ ఫిర్యాదులు

ఏపీలో వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసే క్రమంలో పరిమితికి మించి అప్పులు తీసుకుంటుందని, పీడీ ఖాతాలకు మళ్లింపులు చేస్తోందని బీజపీ నేతలు పలు ఆరోపణలు చేశారు. ఇవే ఆరోపణల్ని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా కేంద్రం మాత్రం ఈ ఆరోపణలు పట్టించుకోకూుండా గణాంకాలు, అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే రెవెన్యూ లోటు భర్తీకి నిధుల కేటాయింపు చేసినట్లు అర్దమవుతోంది. రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా నివేదికల ఆధారంగానే కేటాయింపులు చేస్తోందని దీన్ని బట్టి తెలుస్తోంది. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం వైసీపీ సర్కార్ కు ఊరటనిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+