కేంద్రం నిధులు: ఏపికి రూ. 385 కోట్లు, టికి రూ. 150 కోట్లు
న్యూఢిల్లీ: 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు నిధులను ఆదివారం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 385 కోట్లు విడుదల చేయగా, తెలంగాణ రాష్ట్రానికి 150 కోట్లు విడుదల చేసింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపిలో స్థానిక సంస్థల నిర్వహణ కోసం రూ. 298.82 కోట్లు, గణాంక వ్యవస్థ నిర్వహణ కోసం రూ. 2.6 కోట్లు, ఇతర ప్రాజెక్టుల కోసం రూ. 50 కోట్లు విడుదలయ్యాయి.

మొత్తం 385 కోట్లు విడుదల చేసింది. ఇక తెలంగాణకు రూ. 149.87 కోట్లు విడుదలయ్యాయి. 13వ ఆర్థిక సంఘంల పేర్కొన్న సిఫార్సుల మేరకు తాజా నిధులు విడులయ్యాయి.












Click it and Unblock the Notifications