ఎన్నికల వేళ.. కేంద్రం నుంచి జగన్‌కు గుడ్ న్యూస్

ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమిస్తోంది.

ఈ పరిణామాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుడ్ న్యూస్ ఇచ్చింది. ఏపీకి ఉన్న పన్ను బకాయిల మొత్తాన్ని విడుదల చేసింది. దీని విలువ 2,952.74 కోట్ల రూపాయలు. బకాయిల కోసం వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం పలుమార్లు కేంద్రంపై ఒత్తిడిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు అవి ఫలించాయి.

Centre releases Rs 72961 crore of Tax Devolution to States, Andhra gets 2952 Cr

ఏపీతో పాటు మిగిలిన అన్ని రాష్ట్రాలకూ ఈ నిధులను విడుదల చేసింది కేంద్రం. మొత్తంగా 72,961.21 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణకు 1,533.64 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి.

రాష్ట్రాలవారీగా అరుణాచల్ ప్రదేశ్- రూ.1,281.93 కోట్లు, అస్సాం- రూ.2,282.24, బిహార్- రూ.7,335.44, ఛత్తీస్‌గఢ్- రూ.2,485.79, గోవా- 281.63, గుజరాత్- రూ.2,537.59, హర్యానా- రూ.797.59, హిమాచల్ ప్రదేశ్- రూ.605.57, జార్ఖండ్- రూ.2,412.83 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి.

కర్ణాటక- రూ. 2,660.88 కోట్లు, కేరళ- రూ.1,404.50, మధ్యప్రదేశ్- రూ. 5,727.44, మహారాష్ట్ర- రూ. 4,608.96, మణిపూర్- రూ.522.41, మేఘాలయా- రూ. 559.61, మిజోరం- రూ.364.80, నాగాలాండ్- రూ.415.15, ఒడిశా- 3,303.69 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి.

పంజాబ్- రూ. 1,318.40, రాజస్థాన్- రూ. 4,396.64, సిక్కిం- రూ.283.10, తమిళనాడు- రూ.2,976.10, తెలంగాణ- రూ. 1,533.64, త్రిపుర- రూ.516.56, ఉత్తరప్రదేశ్- 13,088.51, ఉత్తరాఖండ్- రూ. 815.71, పశ్చిమ బెంగాల్- 5,488.88 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+