ఏపీకి ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం-సాయిరెడ్డి ప్రశ్నకు రాజ్యసభలో జవాబు..
ఏపీలో ప్రత్యేక హోదాపై కేంద్రం ఇవాళ మరో అప్ డేట్ ఇచ్చింది. ప్రత్యేక హోదా డిమాండ్ పై ఇప్పటికే పలుమార్లు సీఎం జగన్ ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి వినతిపత్రాలు ఇవ్వడం, పార్లమెంటులో వైసీపీ, టీడీపీ ఎంపీల ప్రశ్నల నేపథ్యంలో కేంద్రం మరోసారి తన స్టాండ్ క్లియర్ చేసేసింది. ఇవాళ రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు.
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, జనరల్ కేటగిరీ రాష్ట్రాల మధ్య పధ్నాల్గవ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసాన్ని చూపలేదని కేంద్రం స్పష్టం చేసింది. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్ ప్రభుత్వ హామీ పరిస్థితి ఏమిటి అంటూ రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు.

రాష్ట్రాలతో కేంద్రం పంచుకునే పన్నుల రాబడి సమాంతరంగా జరగాలన్న ఆర్థిక సంఘం సిఫార్సు మేరకే గతంలో పన్నుల పంపిణీలో 32 శాతం ఉన్న రాష్ట్రాల వాటాను 2015-2020 కాలానికి 42 శాతానికి పెంచినట్లు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. పదిహేనవ ఆర్థిక సంఘం సైతం 2020-2026 కాలానికి ఈ పంపిణీ నిష్పత్తిలో పెద్దగా మార్పులు చేయలేదన్నారు. కొత్తగా జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంగా అవతరించినందున 42 శాతాన్ని 41 శాతానికి స్వల్పంగా తగ్గించినట్లు తెలిపారు. పన్నుల్లో వాటా పంపిణీ ద్వారా ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటును పూడ్చడం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో 90:10 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రం భరించడం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిలో ఒక అంశమని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. 2015-16 నుంచి 2019-20 మధ్య కాలంలో విదేశీ ఆర్థిక సంస్థల రుణ సహాయంతో చేపట్టే ప్రాజెక్ట్‌ల వ్యయాన్ని వడ్డీతో సహా కేంద్రమే చెల్లించడం ప్యాకేజీలో ప్రధాన అంశమని రాయ్ చెప్పారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత సానువులను ఆనుకుని ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాల్లో అమలు చేసే కేంద్ర పథకాల వ్యయంలో 90 శాతం కేంద్రం, 10 శాతం ఆయా రాష్ట్రాలు భరిస్తాయని మిగిలిన రాష్ట్రాలలో ఈ నిష్పత్తి 60:40గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
-
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications