ఏపీలో ఎన్నికలపై తాజా అలర్ట్ - ఆదేశాలు జారీ..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల నిర్వహణ పైన అధికారులను సీఈవో అలర్ట్ చేసారు. వచ్చే వారం తరువాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇటు పార్టీలు ఎన్నికల యుద్దానికి సిద్దం అవుతున్నాయి. సీఎం జగన్ రేపు అనంతపురంలో సిద్దం సభ ద్వారా కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు. టీడీపీ, బీజేపీ పొత్తు పైన ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయం లోనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు.
ఎన్నికల సన్నద్ధతపై జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలతో సిఇఒ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బంది నిర్వహణ, ఓటర్ లిస్టుల తయారీ, ఓటరు కార్డుల పంపిణీ, పోలింగ్ స్టేషన్లలో కనీస వసతులు ఏర్పాటు, లా అండ్ ఆర్డర్ నిర్వహణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. పోలీస్‌శాఖలో సిబ్బంది కొరత ఉన్న జిల్లాలు అదనపు సిబ్బందిని సమకూర్చుకునే అవకాశాలపై వెంటనే రిపోర్టు సమర్పించాలన్నారు. పోలింగేతర విధులకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు నెలాఖరు కల్లా పూర్తి చేసి ఎన్నికల విధుల్లో ఉండనున్న ప్రతి ఒక్క ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించేందుకు ఏర్పాటు చేయాలన్నారు.

Recommended Video

శాసనసభ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొననున్న సిబ్బంది జాబితా తయారీ పూర్తి చేయాలని కలెక్టర్లు, ఎస్‌పిలను ఆదేశించారు. నెలాఖరులోగా సమస్యాత్మక ప్రాంతాల నివేదిక అందించాలని ఎస్‌పిలను ఆదేశించారు. జిల్లాల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టుల విషయంలో ఆయా జిల్లాల ఎస్‌పిలు సమన్వయం చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ రూట్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. మేజర్ రూట్లతో పాటు మెయిన్ రూట్లలోనూ నిరంతరం పర్యవేక్షణ ఉండేలా మొబైల్ స్క్వాడ్‌లు, స్టాటిక్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. సాధ్యమైనంత ఎక్కువ రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బంది సంఖ్య ప్రాథమిక అంచనా కంటే 20 శాతం అదనంగా ఉండాలని సూచించారు. పోలీసుశాఖలో సిబ్బంది కొరత ఉన్న జిల్లాలు అదనపు సిబ్బందిని సమకూర్చుకునే అవకాశాలపై వెంటనే రిపోర్టు సమర్పించాలన్నారు.












Click it and Unblock the Notifications