తాగేసి బైక్‌ను వెంటాడి మహిళ పట్ల అసభ్యంగా...

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని లక్డీకాపూల్‌లో చైన్‌స్నాచర్స్ అత్యంత నీచంగా ప్రవర్తించారు. ఓ మహిళ మెడలో నుంచి చైన్ లాక్కెల్లేందుకు విఫలయత్నం చేశారు. చైన్ లాక్కునేందుకు యత్నించిన దుండగులను స్థానికులు పట్టుకున్నారు.

బుధవారం లక్డీకాపూల్‌లో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను ద్విచక్రవాహనంపై వెంటాడిని ఇద్దరు వ్యక్తులు కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆమె చైన్‌ను లాక్కునేందుకు ప్రవర్తించారు. అది విఫలం కావడంతో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీన్ని గమనించిన స్థానికులు దుండగులను పట్టుకోడానికి ప్రయత్నించారు.

 Chain snatchers misbehave with woman

వారిలో ఒకరు తప్పించుకోగా, మరొ దుండగుడు స్థానికులకు పట్టుబడ్డాడు. ఇదే సమయంలో అక్కడి వచ్చిన పోలీసులపైనా దుండగుడు మద్యం మత్తులో అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. వెంటనే పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+