ఢిల్లీలో సమైక్యం: అశోక్, తీవ్ర పరిణామాలన్న శ్రీనివాస్
హైదరాబాద్: ఫిబ్రవరిలో చలో పార్లమెంటు నిర్వహిస్తామని ఏపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఆయన సోమవారం ఏపిఎన్జీవో భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సమైక్యవాదాన్ని ఢిల్లీలోనూ వినిపిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.
ఫిబ్రవరి 3న అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అశోక్ బాబు చెప్పారు. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. విభజన బిల్లు రాజ్యాంగ బద్ధంగా లేనందున ఆ బిల్లును ఓడించాలని అన్ని జాతీయ పార్టీలను కోరతామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై సంక్లిష్టత ఏర్పడిందని, బిల్లు తిరస్కరించినా.. ఓడించినా పార్లమెంటుకు వెళ్లే అవకాశం ఉందని అశోక్ బాబు తెలిపారు. చలో పార్లమెంటును ఎన్ని రోజులనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
టి బిల్లు తిప్పి పంపితే తీవ్ర పరిణామాలు: శ్రీనివాస్ గౌడ్
శాసనసభలో చర్చ జరుగుతున్న తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తిప్పి పంపితే తీవ్ర పరిణామాలుంటాయని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు తిప్పి పంపితే.. అత్యవసర సేవలు నిలివేసే విషయంపై చర్చిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications