జగన్‌తో వరుసగా: చంచల్‌గుడా జైలు విఐపి బ్యారక్ ఖాళీ
హైదరాబాద్: విఐపి ఖైదీలతో క్రిక్కిరిసి పోయిన హైదరాబాదులోని చంచల్‌గుడా జైలు విఐపి బ్యారక్ ఇప్పుడు బోసిపోయింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో పాటు వరుసగా ఒక్కరొక్కరికి బెయిల్ లభించడంతో బయటకు వచ్చారు. దీంతో విఐపి బ్యారక్‌లో విఐపి ఖైదీ ఇద్దరే ఉన్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) మాజీ మేనేజింగ్ డైరెక్టర్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బంధువు బివి శ్రీనివాస్ రెడ్డి మాత్రమే ఆ బ్యారక్‌లో మిగిలిపోయారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది. దీంతో ఆయన శుక్రవారం జైలు నుంచి బయటకు వస్తున్నారు. జగన్ చాలా రోజుల క్రితమే బైయిల్‌పై బయటకు వచ్చారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో నిందితుడు సునీల్ రెడ్డి, సస్పెన్షన్‌కు గురైన ఉన్నతాధికారి బిపి ఆచార్య, మాజీ మైన్స్ డైరెక్టర్ విడి రాజగోపాల్, కోనేరు ప్రసాద్‌లు ఇప్పటికే బెయిల్‌పై బయటకు వచ్చారు.

సోమవారం బెయిల్ మంజూరు కావడంతో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్, ఉన్నతాధికారి కెవి బ్రహ్మానందరెడ్డి మంగళవారంనాడు జైలు నుంచి బయటకు వచ్చారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఆరోగ్య కారణాలపై బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన ఇప్పటికే జైలు నుంచి బయటకు వచ్చారు. వివిధ కేసుల్లో అరెస్టయిన నూకారపు సూర్యప్రకాష్ ఈ ఏడాది ప్రారంభంలో జైలు నుంచి విడుదలయ్యారు.
విఐపి ఖైదీలు బయటకు రావడంతో దాన్ని వేరే ప్రయోజనాలకు వాడాలని జైలు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. విఐపి ఖైదీలను దృష్టిలో పెట్టుకుని జైలు ఆవరణలో కొత్త భవన నిర్మాణం జరుగుతోందని అంటున్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications