జగన్‌కు మరో షాక్: టీడీపీలోకి చాంద్ బాషా, లోకేష్ పాత్రే కీలకం
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా 50 వాహనాల్లో కార్యకర్తలు, నేతలతో కలిసి విజయవాడకు బయల్దేరినట్లు తెలిసింది.
ఈ సమాచారం అందుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఆయన్ని బుజ్జగించేందుకు హైదరాబాద్ నుంచి బయల్దేరినట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు.. ఎమ్మెల్యే బాషాను సంప్రదించేందుకు ఫోన్ చేయగా.. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చినట్లు తెలిసింది.

గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన చాంద్ బాషా ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలుపొందారు.
తాజాగా, కొద్ది రోజుల క్రితం, చాంద్ బాషా సోదరులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిసి పార్టీలో చేరికపై చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే చాంద్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కాగా, శుక్రవారం సాయంతరం చాంద్ బాషా తన అనుచరులతో విజయవాడకు పయనమయ్యారు. ఆయనతోపాటు సుమారు 20మంది కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, స్థానిక నేతలు వెళ్లినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కిందిస్థాయి నేతల ఒత్తిడి కూడా ఉందని సమాచారం.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే 12మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరగా.. చాంద్ బాషా చేరికతో ఆ సంఖ్య 13కు చేరనుంది. కాగా, శనివారం చాంద్ బాషా.. టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications