జగన్ తో బీజేపీ కొత్త లెక్కలు - చంద్రబాబు అలర్ట్..!!

జాతీయ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కేంద్రంలో టీడీపీ కీలకంగా మారుతోంది. అదే సమయంలో రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేదు. తాజాగా పెద్దల సభలో బీజేపీకి వైసీపీ మద్దతు పైన చర్చలు మొదలయ్యాయి. ఎన్డీఏలో టీడీపీ లేని సమయంలో మద్దతుగా నిలిచిన జగన్..ఇప్పుడు ఇస్తారా లేదా అనేది చర్చగా మారింది. ఈ సమయంలోనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు.

ఢిల్లీ కేంద్రంగా
కేంద్రంలో రాజకీయంగా కొత్త లెక్కలు మొదలయ్యాయి. కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. రాజ్యసభలోనూ ఎన్డీఏకు పూర్తి మెజార్టీ లేదు. గత అయిదేళ్ల కాలంలో ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా వైసీపీ పలు సందర్భాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఏపీ నుంచి టీడీపీ, జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు వైసీపీకి రాజకీయ ప్రత్యర్ధులు. తాజాగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక సమయంలోనూ వైసీపీ మద్దతు బీజేపీ కోరగానే..వైఎస్సార్సీపీ అంగీకరించింది.

Chandra Babu alert amid YSRCP can still influence in Rajya Sabha for BJP

వైసీపీ మద్దతు
మూడో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తాము అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే పలు మార్లు చెప్పుకొచ్చారు. కేంద్రం తీసుకొనే నిర్ణయాలకు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే ఎన్డీయేకు మాజీ మిత్రపక్షాలైన తమిళనాడులోని అన్నాడీఎంకే, ఏపీ నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్ పార్టీ కీలకంగా మారాయి. కాగా ఈ రెండు పార్టీల ఎంపీలను( అన్నాడీఎంకే 4, వైయ‌స్ఆర్ సీపీ11) కలిపిన మొత్తం 101 అడంతో బిల్లులు ఆమోదం పొందడానికి మరో 13 మంది ఎంపీల బలం అవసరం.

చంద్రబాబు లెక్కలు
అయితే, ఇప్పుడు జగన్ గతంలో మాదిరిగానే బీజేపీకి మద్దతు ఇస్తారా లేదా అనేది చర్చగా మారింది. టీడీపీ మాత్రం బీజేపీ ఇక వైసీపీతో బంధం కొనసాగించకూడదని భావిస్తోంది. కానీ, బీజేపీకి రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరమని లెక్కలు వేస్తోంది. ఇటు టీడీపీతో మైత్రి..అటు వైసీపీ సంఖ్య బలం అవసరం వేళ బీజేపీ కేంద్ర నిర్ణయం కీలకంగా మారుతోంది. తాజాగా అమిత్ షా తో చంద్రబాబు భేటీ సమయంలోనూ రాజకీయ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో..రానున్న రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకొనే రాజకీయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+