ఏపీ ప్రభుత్వ నిర్ణయాల నడుమ "అఖండ" : హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఆనంద క్షణాలు : జూ ఎన్టీఆర్ - చంద్రబాబు రియాక్షన్..
ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలు.. బాలయ్య అఖండ మూవీతోనే మొదలవ్వటంతో ఈ సినిమా పైన ఎటువంటి ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది. నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. వీరిద్దరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ చిత్రాల తరువాత వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే అంచనాలను మించి దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి ఖండ ఖండాలలో 'అఖండ'మైన విజయం లభించింది. 2021లో ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా 'అఖండ' రికార్డు క్రియేట్ చేసింది.

బాలయ్య అభిమానుల పండుగ
అఖండ ప్రదర్శించిన ధియేటర్లలో 'జై బాలయ్య' నినాదాలతో హోరెత్తాయి. సోషల్ మీడియాలో, థియేటర్ల వద్ద భారీ కటౌట్లు పెట్టి ఆయన అభిమానులు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక సినిమాపై విమర్శకులతో పాటు ప్రేక్షకులు కూడా పాజిటివ్ గా స్పందించగా మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు సైతం ప్రశంసలు కురిపించారు. ఇది టాలీవుడ్ కు పండగ అంటూ 'అఖండ'ను ఆకాశానికెత్తేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెషల్ ట్వీట్ చేశారు.
చంద్రబాబు అభినందనలు
"అఖండ విజయం సాధించిన "అఖండ" సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ సభ్యులకు, అభిమానులకు అభినందనలు" అంటూ చంద్రబాబు చిత్రబృందాన్ని అభినందించారు. ఇక సినిమా విజయవంతం కావడంతో బాలయ్య, డైరెక్టర్ బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తో పాటు చిత్రబృందం చాలా సంతోషంగా ఉంది. సినీ స్టానర్స్ తో పాటుగా పొలిటికల్ లీడర్స్ సైతం ఈ సినిమా కు వచ్చిన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య సైతం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
జూ ఎన్టీఆర్ రెస్సాన్స్ అదుర్స్
ఇక, తాజాగా జూ. ఎన్టీఆర్ అఖండ చిత్రాన్ని వీక్షించి ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలిపారు. " ఇప్పుడే అఖండ మూవీ చూసాను.. కంగ్రాట్స్ బాల బాబాయ్ .. ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన చిత్ర బృందానికి అబినందనలు .. ఎంతోమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఆనంద క్షణాలు ఇవి" అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి. బాబాయ్ సినిమాకు అబ్బాయి అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు.. అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా తారక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎలాగూ రాలేదు.. కనీసం సక్సెస్ మీట్ కైనా వస్తే బావుంటుందని, ఒకే వేదికపై బాబాయ్- అబ్బాయ్ సందడి చేస్తే..దాని కిక్కే వేరని చెబుతున్నారు. అయితే, అది జరుగుతుందా లేదా అనేది చూడాలి.
Recommended Video

ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయాల నడుమ
ఇక, ఈ సినిమాకు సంబంధించి ఏపీలో బెనిఫిట్ షో లు ప్రదర్శించిన రెండు ధియేటర్లను సీజ్ చేసారు. టిక్కెట్ల ధరలు.. బెనిఫిట్స్ షోల పైన ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలను అధిగమమిస్తూ అఖండ పూర్తి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే, సినిమా సక్సెస్ మీట్ కు జూనియర్ వస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్ లోనూ ఈ మూవీకి వచ్చిన స్పందన చూసి బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications