చంద్రబాబు..పవన్ కలిసారు: చిరంజీవి ఆయనతో ఏం చెప్పారు : అందరి దృష్టి వారి మీదే : ...!
ఎన్నికల ప్రచారంలో వారిద్దరూ ఒకటే అనే అరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరు సైతం ఆరోపణలు చేసుకున్నారు. ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు మిగిలాయి. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆ ఇద్దరు ఒకే చోట చేరారు. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఇక, అందరి దృష్టి ఆ ఇద్దరి మీదే..

ఎన్నికల తరువాత తొలిసారి..
2014 ఎన్నికల్లో కలిసి పని చేసిన ఆ ఇద్దరు తాజా ఎన్నికల్లో మాత్రం విడివిడిగా తల పడ్డారు. టిడిపి అధినేత చంద్రబాబు..జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఇద్దరూ ఎన్నికల తరువాత తొలిసారి కలిసారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మనవరాలు కీర్తి సుహానా..నవయుగ గ్రూప్స్ ఛైర్మన్ సి విశ్వేశ్వర రావు మనవడు రాయల వినయ్ తో రామెజీ ఫిల్మ్‌సిటీలీ వివాహం జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబంతో కలిసి రాగా..పవన్ దర్శకుడు త్రివిక్రమ్‌తో పాటుగా వచ్చారు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని సరదాగా మాట్లాడుకున్నారు. చంద్రబాబుకు పవన్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు..పవన్ మధ్య సినీ కేరక్టర నటుడు చలపతి రావు జోకులు వేస్తూ ఇద్దరినీ నవ్వించారు. వీరిద్దరి కలయిక సమయంలో వివాహ వేదిక వద్ద అందరి దృష్టి వీరి పైనే ఉంది. ఆ తరువాత చంద్రబాబు వెళ్లిపోగా..పవన్ వధూవరులను ఆశీర్వదించారు. వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి వివాహానికి హాజరయ్యారు.

చిరంజీవి..గంటా ఆత్మీయ పలకరింపు..
ఇదే వివాహా కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరయ్యారు. అప్పటికే అక్కడికి చేరుకున్న గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి కోండ్రు మురళీ ఇద్దరూ తాజా రాజకీయాల పైన చర్చించుకుంటున్నారు. ఆ సమయం లోనే అక్కడకు చిరంజీవి చేరుకోగా..వెంటనే గంటా ఆయన వద్దకు వెళ్లి మర్యాద పూర్వకంగా పలకరించారు. కొద్ది సేపు ఆ ఇద్దరి మధ్య సీరియస్‌గా మంతనాలు సాగాయి. చిరంజీవి ప్రజారాజ్యం నుండి 2009 ఎన్నికల్లో గెలిచిన గంటా ఆ తరువాత చిరంజీవి సిఫార్సుతో కిరణ్ కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసారు. ఇక, తాజాగా ఆయనపై పవన్ కళ్యాన్ తీవ్ర విమర్శలు చేసారు. గంటా లాంటి వారు వస్తామన్నా తాము తమ పార్టీలోకి తీసుకోబోమని స్పష్టం చేసారు. అయితే, గంటా మాత్రం పెద్దగా పవన్ పైన విమర్శలు చేయలేదు. పవన్ మాత్రం ప్రజారాజ్యం నుండి వచ్చిన వారిలో ఎక్కువగా గంటా..కన్నబాబు పైనే పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. అయితే, పవన్ అక్కడకు రావాటానికి ముందుగానే వీరిద్దరి భేటీ జరిగింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications