జవహర్ రెడ్డికి చంద్రబాబు బిగ్ షాక్ - ఇక చాలు..!!
ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో అధికారుల టీం కూర్పు పైన ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమయంలోనే జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను పక్కన పెట్టాలని భావిస్తున్నారు. తాజాగా చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి కలిసారు. ఆయనకు కొత్త ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సంకేతాలతో షాక్ అయ్యారు.
చంద్రబాబుతో భేటీ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో జవహర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఆయన కలిసిన సమయంలో చంద్రబాబు ముభావంగా ఉన్నట్లు సమాచారం. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, జవహర్ రెడ్డి, మరికొందరు అధికారులు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు మొదట డీజీపీని పిలిపించి కొద్దిసేపు మాట్లాడారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత జవహర్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారులు అందరినీ ఒకేసారి తన గదిలోకి పిలిపించారు. జవహర్ రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చే సమయంలో చంద్రబాబు ఎలాంటి ప్రతిస్పందనా వ్యక్తం చేయకుండా ముభావంగా ఉన్నారు.

క్లియర్ సంకేతాలు
ఈ సమయంలోనే కొన్ని విషయాలు వివరించాల్సి ఉందని జవహర్ రెడ్డి చెప్పగా, ఇప్పుడేమీ అవసరం లేదని చంద్రబాబు బదులిచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సెలవుపై వెళ్లాలని ఆయనకు సంకేతాలు పంపినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో ఆయన ఏకపక్షంగా పనిచేయడంతో పాటు తీవ్ర ఆరోపణలు రావడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి ఉండటాన్ని అప్పటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యతిరేకించింది. ఆయనను బదిలీ చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తులు పంపింది.
మీ సేవలు ఇక చాలు
వృద్ధులకు నెలవారీ పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి వలంటీర్లను దూరంగా ఉంచిన తర్వాత సచివాలయాల సిబ్బంది ద్వారా ఇళ్ల వద్ద పంపిణీ చేయించాలని సీఎ్‌సను టీడీపీ కోరింది. కాన్నీ అందుకు విరుద్ధంగా ఒక నెలలో గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేయించిన అధికార యంత్రాంగం.. తర్వాతి నెలలో బ్యాంకు ఖాతాల్లో వేయించింది. ఇక విశాఖ చుట్టుపక్కల ఎసైన్‌మెంట్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు అక్రమంగా కొనుగోలు చేశారని జనసేన, టీడీపీ బహిరంగంగా ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆయనను ప్రధాన కార్యదర్శిగా కొనసాగించడం వాంఛనీయం కాదని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికే తప్పుకొని సెలవుపై వెళ్తే బాగుంటుందని ఆయనకు సమాచారం పంపారని ప్రచారం జరుగుతోంది.
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు ఫిక్స్, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications