చంద్రబాబు కీలక ప్రకటన - కొత్త రూపు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఉప ముఖ్యమంత్రి పవన్ తో కలిసి కూటమి ప్రభుత్వ లక్ష్యాలను వెల్లడించారు. 2047 నాటికి మన తెలుగు వారంతా ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలని చెప్పిన చంద్రబాబు..ఆ సంకల్పంతో పని చేస్తామని చెప్పుకొచ్చారు. మనందరకీ మంచి రోజులు వస్తాయి.. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సమయం లో ఏపీకి త్వరలో కొత్త యూనివర్సిటీ రానున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
ఏపీలో త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని నెలకొల్పనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. పొట్టి శ్రీరాములు 72వ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు సాగించిన మహత్తర పోరాటం మరువలేమని చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల మనమంతా తెలుగు వాళ్లం అంటున్నామని అన్నారు. 50 సంవత్స రాల పోరాటం, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చిందని చెప్పా రు. తెలుగు వాళ్ల విగ్రహాలను ట్యాంక్ బండ్‌పై ఎన్టీఆర్ ఏర్పాటు చేయించారని చంద్రబాబు వెల్లడించారు.

నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా తాను నామకరణం చేశానని చెప్పుకొచ్చారు. కొంతమంది తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేశారని ఆరోపించారు. 2019 తర్వాత మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. రూ. 4 వేలు పెన్షన్ ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదు. ఇబ్బందులు తాత్కాలికంగా ఉంటాయని చెప్పిన చంద్రబాబు..వాటిని అధిగమిస్తామన్నారు.
2025 మార్చి 16 నుంచి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి ఉత్సవాలు ఘనంగా చేస్తామని వెల్లడించారు. పొట్టి శ్రీరాములు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇంటిని మెమోరియల్‌గా చేస్తామని..రాజధాని అమరావతిలో స్మృతి వనం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.












Click it and Unblock the Notifications