నా పిలుపుతో ఓట‌ర్లు త‌ర‌లి వ‌చ్చారు: పార్టీ యాడ్స్ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లాయి: చ‌ంద్ర‌బాబు ధీమా..!

ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు ఖాయ‌మ‌ని..సీట్లు..మెజార్టీలు మాత్ర‌మే తేలాల్సి ఉంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ధీమా వ్య‌క్తం చేసారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పోలింగ్ స‌ర‌ళి పైన చంద్ర‌బాబు అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో భేటీ అయ్యారు. త‌న పిలుపుతో ఓట‌ర్లు త‌ర‌లి వ‌చ్చార‌ని..పోల‌వ‌రం చూసిన వారెవ‌రైనా మ‌రో పార్టీకి ఓటు వేస్తారా అని ప్ర‌శ్నించారు. శాశ్వ‌తంగా అధికారంలో ఉండట‌మే లక్ష్య‌మ‌న్నారు.

యాడ్స్ ప్ర‌జ‌ల్లో బ‌లంగా వెళ్లాయి..
ఎన్నిక‌ల్లో విజ‌యం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో పోలింగ్ స‌ర‌ళి పైన స‌మీక్షించారు. ప్ర‌చారం నుండి పోలింగ్ వ‌ర‌కు ప్ర‌తీ ద‌శ‌లోనూ పార్టీ పైచేయి సాధించింద‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. పార్టీ రూపొందించిన యాడ్స్ ప్రజల్లోకి బలంగా చొచ్చుకొని వెళ్లాయని సీఎం చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. తొలి దశలోనే ఎన్నికలు పెట్టడం తమకే సానుకూలంగా మారాయని, ఓటింగ్ శాతం పెరగడం కలిసొచ్చే అంశమని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్దికి ఆటంకాలు సృష్టించిన వారే పోలింగ్ నాడు దాడుల‌కు తెగ‌బ‌డ్డార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. వైసీపీకీ కేసీఆర్‌..మోదీ తోడ్పాటు అందించార‌ని చంద్ర‌బాబు మండి ప‌డ్డారు.

Chandra Babu confident elections results will be one side in favour of TDP..

ఎన్నిక‌లు ఏక‌ప‌క్షం...
ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌లు ఏక‌ప‌క్షంగా సాగాయ‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. పోల‌వ‌రం నిర్మాణ పనులు చూసిన వారు ఎవ‌రైనా ఇత‌ర పార్టీల‌కు ఓటు వేస్తారా అని ప్ర‌శ్నించారు. పోలవరం ప్రయోజనాలు ముందస్తుగా పొందేందుకే పురుషోత్తపట్నం ఎత్తిపోతలను ప్రారంభించామని, పోలవరానికి కేంద్రం నుంచి ఇంకా 4,700 కోట్లు రావాల్సి ఉన్నాయని వివ‌రించారు. టీడీపీ గెలుపు రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికే అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఓటింగ్ శాతాన్ని దెబ్బతీయడానికి అనేక కుట్రలు చేశారని, పోలింగ్ రోజు ఓటర్లను అనేక భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. అయినా సరే ఆయన పిలుపుతో అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఓటేశారని చెప్పుకున్నారు. ఆఖరి నిమిషంలో పోరాడాం కాబట్టే అద్భుత విజయాన్ని సాధించబోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+