చంద్రబాబు ఆస్తి : 2.9 కోట్లు...దేవాన్ష్ ఆస్తి : 18.71 కోట్లు
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తులను ఆయన తనయుడు మంత్రి లోకేష్ ప్రకించారు. వరుసగా ఎనిమిదో సారి ఆస్తులను ప్రకటిస్తున్నామని చెప్పిన లోకేష్ తన తండ్రి తో పాటుగా తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, తన ఆస్తులతో పాటుగా కుమారుడు దేవాన్ష్ ఆస్తులను వెల్లడించారు. కాగా హెరిటేజ్ నికర లాభం 60.38 కోట్లుగా ప్రకటించారు.
టిడిపి అధినేత..ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల ఆదాయ వివరాలను ప్రకటించిన లోకేష్.. వారి అప్పులను సైతం వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు మీద ఉన్న ఆస్తుల విలువ మొత్తంగా 2.9 కోట్లు గా తేల్చారు. కాగా, తన తల్లి నారా భువనేశ్వరి ఆస్తుల విలువ 31.01 కోట్లుగా నిర్ధారించారు. ఇక, నారా లోకేష్ ఆస్తి వివరాలు మొత్తం 21.40 కోట్లుగా ప్రకటించారు. నారా బ్రాహ్మణి ఆస్తి విలువ 7.72 కోట్లు. ఇక చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ ఆస్తుల నికర లాభం 60.38 కోట్లుగా లోకేష్ వెల్లడించారు.

హైదరాబాద్ లో తాజా గా నిర్మించిన ఇంటి విలువ 8 కోట్లుగా తేల్చారు. అదే విధంగా.. చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో నివాసం విలువ 23.83 లక్షలుగా ప్రకటించారు. ఆసక్తి కరంగా చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఆస్తి విలువ 18.71 కోట్లు. ఇక, తమ కుటుంబానికే చెందిన నిర్వాణ హోల్డింగ్స్ నికర ఆస్తులు 6. 83 కోట్లుగా ప్రకటించిన లోకేష్..అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పులు 5.31 కోట్లు ఉన్నాయని..భువనేశ్వరి పేరిట అప్పులు 22.35 కోట్లు ఉన్నాయని వివరించారు. రాజకీయాల్లో ఉన్న తాము ప్రజలకు జవాబుదారీ తనం తో ఉండానికే అధికారంలో ఉన్నా..లేకున్నా తమ ఆస్తులను ప్రకటిస్తున్నామని లోకేష్ వివరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications