టుడే స్పెష‌ల్ : కొడాలి నాని ల‌క్ష్యంగా బాబు : రోజా కోసం జ‌గ‌న్ : ఉత్కంఠగా మారిన అధినేత‌ల ప్ర‌చారం..!

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఈ రోజు ఆస‌క్తి క‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి చాలా కాలంగా లక్ష్యంగా చేసు కున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గం లో చంద్ర‌బాబు ప‌ర్య‌టిస్తున్నారు. అదే విధంగా టిడిపి నేత‌ల‌ను త‌న వాగ్భాణాల‌తో ఇబ్బంది పెట్టే వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా కు మ‌ద్ద‌తుగా వైసిపి అధినేత జ‌గ‌న్ న‌గ‌రి లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు అధినేతలు..ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల పర్య‌ట‌న ఉత్కంఠ క‌లిగిస్తోంది.

కొడాలి నాని ల‌క్ష్యంగా...

కొడాలి నాని ల‌క్ష్యంగా...

ఎలాగైనా కొడాలి నాని ని ఈ ఎన్నిక‌ల్లో ఓడించాలి. ఇది టిడిపి అధినేత చంద్ర‌బాబు..మంత్రి లోకేష్ లక్ష్యం. ఇందు కోసం గుడివాడ లో ప్ర‌త్యేక వ్యూహం అమ‌లు చేస్తున్నారు. అక్క‌డ ఎప్ప‌టి నుండి టిడిపి లో ఉన్న రావి కుటుంబాన్ని కాద‌ని..తెలుగు యువ‌త అధ్య‌క్షుడు దేవినేని అవినాశ్ ను పోటీకి దింపారు. కృష్ణా జిల్లాలో ఉన్న సామాజిక వ‌ర్గాల ప్రాబ‌ల్యం అభ్య‌ర్దుల గెలుపు ఓట‌ముల‌ను ప్ర‌భావితం చేస్తుంది. అందులో ఒక‌రైన దేవినేని ఆవినావ్ కు గుడివాడ‌లో నానికి ధీటైన అభ్య‌ర్దిగా టిడిపి భావించింది. ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు టిడిపి ఆవిర్భావ దినోత్స‌వం నాడు గుడివాడ‌లో ప‌ర్య‌టించి..ఎన్టీఆర్ ను గుర్తు చేయ‌టం తో పాటుగా టిడిపికి అండ‌గా నిలిచిన గుడివాడ ప్రాభ‌వాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి ..అవినాశ్ ను గెలిపించాల‌ని చంద్ర‌బాబు అభ్య‌ర్దించ‌నున్నారు. కొడాలి నాని ని ఓడించేందుకు చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ఏ స్థాయిలో మ‌ద్ద‌తు ఉందో ఈ రోజు ప‌ర్య‌ట‌న‌లో వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది.

న‌గ‌రి లో జ‌గ‌న్ ప్ర‌చారం..

న‌గ‌రి లో జ‌గ‌న్ ప్ర‌చారం..

వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా తిరిగి న‌గ‌రి నుండి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప మోజార్టీతో గ‌ట్టెక్కిన రోజా ఈ సారి మాత్రం భారీ మెజార్టీతో గెల‌వాల‌ని ల‌క్ష్యం గా పెట్టుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టిడిపి నుండి రోజా పై పోటీ చేసిన గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడి కుమారుడు ఇప్పుడు టిడిపి అభ్య‌ర్దిగా ఉన్నారు. గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు మ‌ర‌ణం తో సెంటిమెంట్ క‌లిసి వ‌స్తుంద‌ని టిడిపి అంచ‌నా వేస్తోంది. అయితే, రోజా మాత్రం పూర్తిగా నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప‌ట్టు కొన‌సాగించాల‌ని భావిస్తున్నారు. దీంతో..ఇప్పుడు రోజాకు మ‌ద్ద‌తుగా జ‌గ‌న్ న‌గ‌రిలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొం టున్నారు. రోజా గెలిస్తే ఎటువంటి అవ‌కాశం క‌ల్పిస్తామ‌నే దాని పై జ‌గ‌న్ హామీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని వైసిపి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. అయితే, రోజా ను ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప్ర‌చారం కోసం వినియోగించుకోవాల‌ని వైసిపి నేత లు భావిస్తున్నారు. న‌గ‌రి లో జ‌గ‌న్ కు ఎటువంటి స్పంద‌న వ‌స్తుందేన‌ది ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారింది.

ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)

చంద్ర‌బాబు డైరెక్ట్ గా టార్గెట్ చేస్తారా..

చంద్ర‌బాబు డైరెక్ట్ గా టార్గెట్ చేస్తారా..

తొలుత టిడిపి లో నంద‌మూరి కుంటుబంతో ఉన్న సాన్నిహిత్యం తో టిడిపి ఎమ్మెల్యే అయిన కొడాలి నాని ఆ త‌రువా త వైసిపి లో చేరారు. వైసిపి నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తిరిగి వైసిపి నుండి పోటీ చేస్తున్నారు. చంద్ర‌బాబు..లోకేశ్ పై కొడాలి నాని సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తీ సారి ఫైర్ అవుతూనే ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగు లేని ప‌ట్టు సాధించారు. ఇక‌, ఇప్పుడు అవినాశ్ ను రంగంలోకి దింప‌టం తో పాటుగా ఖ‌చ్చితంగా గుడివాడ సీటు గెల‌వా ల‌ని టిడిపి అధినాయ‌క‌త్వం ప‌దే ప‌దే చెబుతున్నారు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు కొడాలి నాని పై బ‌హిరంగంగా ఎటువంటి విమ‌ర్శ‌లు చేయ‌ని టిడిపి అధినేత‌..ఈ రోజు ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఎటువంటి వ్యాఖ్య‌లు చేస్తార‌నేది ఆసక్తి క‌రంగా మారింది. డైరెక్ట్ గా కౌంట‌ర్ చేస్తారా లేదా అనేది కూడా ఆస‌క్తి క‌ర‌మే. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో గుడివాడ లో వ‌చ్చే స్పంద‌న ద్వారా అక్క‌డి ఫ‌లితం పై సంకేతాలు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+