సచివాలయల ఉద్యోగులకు చంద్రబాబు బిగ్ రిలీఫ్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ ప్రారంభించింది. రేపు ఒకటో తేదీ సెలవు కావటంతో ముందురోజునే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా రద్దయింది. పెన్షన్లు పంపిణీ చేస్తున్న సచివాలయ సిబ్బంది గురించి చంద్రబాబు తాజా నిర్ణయం తీసుకున్నారు.
పెన్షన్ల పంపిణీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా మూడో నెల సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హాయంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరిగేది. ఎన్నికల కోడ్ సమయంలో వాలంటీర్లను పెన్షన్ల పంపిణీలో తప్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో పెన్షన్ లబ్దిదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లను కాదని..సచివాలయ సిబ్బందితోనే ఒక్క రోజులోనే మెజార్టీ పెన్షన్ల పంపిణీ పూర్తి చేయిస్తోంది.

భారీ వర్షాలతో
ఇక, సెప్టెంబర్ 1 ఆదివారం కావటంతో ఈ రోజునే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచే సచివాలయాల సిబ్బంది పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అయితే, భారీ వర్షాల పైన సమీక్ష చేసిన చంద్రబాబు పెన్షన్ల పంపిణీ పైన ఉన్నతాధికారులకు కీలక సూచన చేసారు. భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చని స్పష్టం చేసారు.
చంద్రబాబు సూచన
ఈ రోజే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలంటూ సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని, టార్గెట్ పెట్టవద్దని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యధావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు. ప్రతీ నెలా ఒక్క రోజులోనే దాదాపు 90 శాతం మేర పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలతో పలు గ్రామాలు..ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకల పైన ప్రభావం చూపుతోంది. దీంతో, సచివాలయ సిబ్బందికి పెన్షన్ల పంపిణీ విషయంలో రిలీఫ్ ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications