గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఆరుగురు పాలస్తీనా పౌరులు మృతి

గాజా స్ట్రిప్‌లో శాంతిని పునరుద్ధరించడానికి కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందాన్ని విధ్వంసం చేస్తూ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం మరోసారి భారీ వైమానిక దాడులు చేసింది. ఈ తాజా దాడుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించగా.. డజన్ల కొద్దీ తీవ్రంగా గాయపడ్డారు. గత నెలలో జరిగిన దాడి తర్వాత గాజా పౌరులు కాస్త ఉపశమనం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

హెచ్-1బీ వీసా వ్యవస్థలో భారీ అక్రమాలు: ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం!
హెచ్-1బీ వీసా వ్యవస్థలో భారీ అక్రమాలు: ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం!

డ్రోన్లతో దాడికి తెగబడిన ఇజ్రాయెల్
సెంట్రల్ గాజాలోని నుస్పేరాత్ క్యాంపుపై గురువారం ఇజ్రాయెల్ డ్రోన్‌తో దాడి చేసిందని గాజా సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. అదే సమయంలో జరిగిన మరో దాడిలో 4గురు మరణించగా.. అనేక మంది గాయపడ్డారు. అల్ జజీరా నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ జనాభా ఎక్కువగా ఉన్న ఓ ప్రాంతంలోని కారును లక్ష్యం చేసుకుని దాడికి తెగబడినట్లు సమాచారం.

Israel attacks on Gaza Six Palestinian citizens killed Ceasefire Violations Continues

గత 24 గంటల్లో 8 మంది మృతి
గడిచిన 24 గంటల్లో 8 మంది మృతి చెందినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 17 మంది గాయపడ్డారు. మృతుల పరిస్థితుల గురించి మంత్రిత్వ శాఖ ఎటువంటి అదనపు సమాచారాన్ని అందించకపోవడం గమనార్హం. అదే సమయంలో, ఇజ్రాయెల్, హమాస్ 2025 అక్టోబర్ 10న కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత కూడా ఈ దాడులు జరుగుతున్నాయని గాజా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

IND vs ENG: ప్చ్.. వైభవ్ మళ్లీ విఫలం: టీమిండియా ఘోర పరాజయం
IND vs ENG: ప్చ్.. వైభవ్ మళ్లీ విఫలం: టీమిండియా ఘోర పరాజయం

ఇరాన్ మాజీ సుప్రీం నాయకుడి అంత్యక్రియలు
ఇరాన్ దివంగత సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ ఇటీవల అంత్యక్రియలు జరిగాయి. అతని అంత్యక్రియలకు 15 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం అమెరికా దాడుల సమయంలో జరిగింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య జరిగిన తాజా సైనిక ఘర్షణలో ఇప్పటివరకు 14 మంది మరణించారు.

ఇరాన్‌లోని బుషెహర్‌లో పేలుళ్లు
దక్షిణ ఇరాన్ నగరాలైన బందర్ అబ్బాస్, బుషెహర్, చోఘడక్‌లలో కూడా అనేక పేలుళ్లు సంభవించాయని ఇరాన్ వార్తా సంస్థ మెహర్ నివేదించింది. మెహర్ ప్రకారం.. బందర్ అబ్బాస్‌లో పెద్ద పెద్ద పేలుళ్లు వినిపించాయి. బుషెహర్, చోఘడక్‌లలో మొత్తం ఆరు పేలుళ్లు జరిగాయి. బుషెహర్ నగర శివార్లలో ఉన్న ఒక సైనిక స్థావరంపై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేశాయని ఇరాన్ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+