నల్లమిల్లి కి చంద్రబాబు కీలక హామీ - సీట్ ఛేంజ్..!?

ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గోదావరి జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి. పొత్తులో భాగంగా మూడు పార్టీల మధ్య సీట్ల లెక్కలు పూర్తయ్యాయి. సీట్లు దక్కని టీడీపీ ముఖ్య నేతలను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్దిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన తరువాత ఆ సీటు బీజేపీకి కేటాయించారు. దీంతో, నల్లిమిల్లి స్వతంత్రంగా పోటీకి సిద్దమైన వేళ చంద్రబాబుతో భేటీ అయ్యారు. కీలక హామీ దక్కింది.

చంద్రబాబుతో భేటీ
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల ఖరారులో ముఖ్య నేతలు సీట్లు కోల్పోయారు. టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తోంది. ఇప్పటికే సీట్లకు అభ్యర్దులను ఖరారు చేసింది. టీడీపీ నుంచి అనపర్తి సీటు దక్కించుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రచారం చేసుకుంటున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అనపర్తి సీటు పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది. అక్కడ నుంచి బీజేపీ తమ అభ్యర్దిని ప్రకటించింది. దీంతో, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తో పాటుగా ఆయన మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను స్వతంత్రంగా పోటీ చేసేందుకు రామకృష్ణారెడ్డి సిద్దమయ్యారు. నియోజకవర్గ పరిధిలో ప్రచారం ప్రారంభించారు.

Chandra Babu Key assurace for Anaparthy TDP Incharge Nallamilli Ramakrishna Reddy on his contesting seat

సీటు నష్టపోతాం
ఇదే సమయంలో టీడీపీ ముఖ్య నేతలు రామకృష్ణారెడ్డి తో సమావేశమయ్యారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని..చంద్రబాబును కలవాలని సూచించారు. దీంతో, బాపట్లలో రామకృష్ణారెడ్డి పార్టీ అధినేత చంద్రబాబు తో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. వైసీపీకి ధీటుగా తాను అయిదేళ్ల కాలంగా పార్టీ తరపున పోరాటం చేస్తున్నానని..నియోజకవర్గంలో తనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చంద్రబాబు చెప్పుకొచ్చారు. బీజేపీ అభ్యర్దికి పార్టీ నుంచి సహకారం అందటం పైన అనుమానాల కు అవకాశం ఇవ్వద్దని సూచించారు. అయితే, బీజేపీ అభ్యర్ది గెలుపు అవకాశాలు లేవని రామకృష్ణారెడ్డి వివరించినట్లు తెలుస్తోంది.

సీట్లు మార్పు తప్పదా
అనపర్తి సీటు వ్యవహారం పైన తాను కూటమి నేతలతో చర్చిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చర్చల తరువాత రెండు రోజుల్లో రామకృష్ణారెడ్డికి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. అయితే, బీజేపీ అనపర్తి సీటు వదులుకోవాలంటే అదే జిల్లాలో మరో స్థానం కోరుతున్నట్లు పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. రాజమండ్రి సిటీ లేదా రూరల్ ఇవ్వాలనేది బీజేపీ నేతల తాజా డిమాండ్ గా చెబుతున్నారు. దీని పైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో..అనపర్తినే బీజేపీకి కొనసాగింది..రామకృష్ణారెడ్డికి భవిష్యత్ పైన హామీ ఇస్తార..లేక..సీటు మార్పు చేసి బీజేపీకి మరో స్థానం కేటాయిస్తారా అనేది ఇప్పుడు గోదావరి జిల్లా రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+