మోదీ, పవన్ కు చంద్రబాబు బిగ్ ఆఫర్- కీలక మలుపు..!!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. చంద్రబాబు సైతం ఇప్పటికే జమిలికి మద్దతు ప్రకటించారు. ఎన్డీఏ సమావేశం తరువాత పార్టీ నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల కోసం నేతలకు సమాయత్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పొత్తుల పైనా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.

చంద్రబాబు వ్యాఖ్యలతో
కూటమిలోని మూడు పార్టీల పొత్తు కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు. తాజాగా పార్టీ నేతల సమావేశంలో మూడు పార్టీల ఐక్యత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మూడు పార్టీల కేడర్ కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. గుజరాత్ లో.. కేంద్రంలో మోదీ వరుస అధికారం దక్కించుకోవటం వెనుక సక్సెస్ గురించి వివరించారు. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే వెళ్లాలంటూ చంద్రబాబు ప్రతిపాదించారు. మిత్రపక్షాలను కలుపుకొని వెళ్లాలని పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. కూటమిగా ఉంటేనే బలం ఉంటుందని తేల్చి చెప్పారు.

Chandra Babu key comments over three parties alliance in next Elections

బీజేపీ సిద్దమేనా
తాజాగా జరిగిన ఎన్నికల సమయంలోనూ మూడు పార్టీల పొత్తు ఖరారులో పవన్ కీలక పాత్ర పోషించారని చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. మొత్తం 164 సీట్లను కూటమి గెలుచుకుంది. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా మూడు పార్టీల మధ్య సఖ్యత అదే విధంగా కొనసాగుతోంది. చంద్రబాబు తన మంత్రివర్గంలో పవన్ కు మాత్రమే డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. పవన్ నిర్ణయాలకు విలువ ఇస్తున్నారు. అదే విధంగా పవన్ సైతం చంద్రబాబు స్పూర్తిగానే పాలనా వ్యవహారాల ను తెలుసుకుంటానని స్పష్టం చేసారు. అటు కేంద్రంలోనూ ఈ సారి ఏపీ విషయంలో ప్రయార్టీ పెరిగింది. ఏపీకి నిధుల విషయంలోనూ సానుకూలంగా వ్యవహరిస్తున్నారు.

పవన్ నిర్ణయం ఏంటి
ఇక, ఏపీలో ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో పవన్ తన పార్టీని మరింత బలోపేతం చేసే ఆలోచన తో ఉన్నారు. వైసీపీ నుంచి కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. స్థానిక సంస్థల్లో తమ పార్టీకి ప్రాధాన్యత ఉంటుందని కేడర్ కు చెబుతున్నారు. అయితే, ఇక డిప్యూటీ సీఎంగానే కొనసాగాల్సి ఉంటుందా అనే చర్చ కూడా మొదలైంది. పవన్ సీఎం కావాలనేది ఆయన మద్దతు దారుల కోరిక. బీజేపీ సైతం కేంద్రంలో సమీకరణాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో, ఇప్పుడు చంద్రబాబు వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే చేస్తున్న ప్రతిపాదనల పైన అటు బీజేపీ.. ఇటు జనసేన స్పందన ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+