చిరంజీవికి చంద్రబాబు మెగా ఆఫర్ - గేమ్ ఛేంజర్..!?
ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. జమిలి ఎన్నికల ప్రచారం వేళ చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కూటమి వచ్చే ఎన్నికలకు కొనసాగాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. తాజాగా ఎన్నికల్లో సక్సెస్ అయిన "మెగా" ఫార్ములా కు మరింత బలం పెంచాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ముందు సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన చేసినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.
తాజా ప్రతిపాదన..!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. వరద బాధితుల సహాయార్దం ప్రకటించిన రూ కోటి రూపాయాల చెక్కును అందచేసారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు ఆ తరువాత చంద్రబాబుతో సమావేశం కావటం ఇదే తొలి సారి. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య రాష్ట్రానికి సంబంధించి అంశాలు..వరదల సాయం.. పవన్ పని తీరు గురించి ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక..చిరంజీవిని సైతం తమతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని చంద్రబాబు ఆహ్వానించినట్లు సమాచారం. ఇందు కోసం కీలక ప్రతిపాదన చేసారని చెబుతున్నారు.

చిరంజీవి సిద్దమేనా
చిరంజీవికి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని అదే వేదిక పైన చిరంజీవి - పవన్ చేతులు పైకెత్తి వారికి తాను ఇచ్చే ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలిసేలా చేసారు. దీంతో..చిరంజీవి ఏపీలో సినీ పరిశ్రమను విస్తరించటం..స్టూడియోల ఏర్పాటు తో పాటుగా టూరిజం డెవలప్ మెంట్ కోసం సమయం కేటాయించాలని కోరినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. గతంలో చిరంజీవి కేంద్రంలో టూరిజం శాఖ సహాయ మంత్రిగా పని చేసారు. ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి వ్యవహరించాలని చంద్రబాబు కోరుకుంటున్నారని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. అదే సమయంలో చిరంజీవికి హోదా పరంగా పూర్తి ప్రాధాన్యత ఉండేలా ఆలోచన చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
చిరంజీవికి కీలక హోదా
అయితే, ప్రస్తుతం సినిమాల్లో చిరంజీవి బిజీగా ఉన్నారు. గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి చిరంజీవి చొరవ తీసుకొని ప్రభుత్వంతో చర్చలు చేసారు. ఆ తరువాత పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. అటు సామాజిక సేవలోనూ ముందుంటూ..అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర ముఖ్యులతోనూ సత్సంబంధాలు కలిగిన చిరంజీవి సేవలు వినియోగించుకుంటే ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందు కోసం చిరంజీవికి తగిన హోదా ఇవ్వటం ద్వారా భవిష్యత్ రాజకీయాలకు ఉపయోగం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి..చిరంజీవి ఇందుకు సిద్దంగా ఉన్నారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
-
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications