Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల వార్ రూమ్ లో చంద్రబాబు - సీరియస్..!!

ఏపీలో ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 40 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఉదయం పోలింగ్ ప్రారంభం అయ్యే సమయానికే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇక..పోలింగ్ సరళిని పార్టీల అధినేతలు పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ సరళి గురించి పార్టీ కంట్రోల్ రూం నుంచి పరిశీలిస్తున్నారు.

చంద్రబాబు సమీక్ష
టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసారు. పోలింగ్ సరళి పైన క్షేత్ర స్థాయి నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. పార్టీ కంట్రోల్ రూం నుంచి 175 నియోజకవర్గాల్లో పోలింగ్ ట్రెండ్స్ పై ఆరా తీస్తున్నారు. ఓటర్ల మూడ్ పైన పార్టీ నేతలను అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో జరుగుతున్న దాడులపైన చంద్రబాబుస్పందించారు. పల్నాడు ఎస్పీతో మాట్లాడారు. టీడీపీ శ్రేణులపైన దాడుల గురించి ఆగ్రహం వ్యక్తం చేసారు. కారకుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

Chandra Babu Monitoring the VotingTrends from party control room serious on officials

దాడుల పై సీరియస్
జిల్లాల వారీగా పోలింగ్ జరుగుతున్నతీరు..కూటమికి పోలవుతున్న ఓట్ల గురించి లెక్కలు సేకరించారు. ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. పెద్ద సంఖ్యలో పోలింగ్ శాతం నమోదు కావటం ద్వారా ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు. టీడీపీ శ్రేణుల పైన దాడులు జరుగుతున్నట్లుగా వస్తున్న వార్తల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. పల్నాడులో జిల్లాలో పోలింగ్ ప్రారంభం నుంచి గొడవలు ఆరంభమయ్యాయి. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో వైసీపీ-టీడీపీ వర్గాల బాహాబాహీకి దిగారు.

ఓటర్ల పల్స్ పై ఆరా
దొడ్లేరులోని పోలింగ్ కేంద్రం ఎదుట నడిరోడ్డు మీద ఇరువర్గాల దాడులు చేసుకున్నాయి. పోలీసు బలగాల లేమి కారణంగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అరగంటకు పైగా నడిరోడ్డుపై ఇరువర్గాల ఘర్షణ చోటు చేసుకుంది. రీజియన్ల వారీగా పార్టీ నియమించిన కో ఆర్డినేటర్ల నుంచి పోలింగ్ సరళి పైన చంద్రబాబు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రతీ ఓటరు ఓటు వేసే వరకు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసారు. వైసీపీ నుంచి వస్తున్న సమస్యలను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలింగ్ సరళి ఆధారంగా ఫలితాలపై ప్రధాన పార్టీలు అంచనాకు వస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+