సీయం చంద్ర‌బాబు కుటుంబంలో విషాదం ..

ఏపి ముఖ్య‌మంత్రి చంద‌బాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఉద‌యం హైద‌రాబాద్ లో ఉంటున్న చంద్ర‌బాబు మేన‌ల్లుడు ఆక‌స్మికంగా మ‌ర‌ణించారు. ఆయ‌న‌కు గుండె సంబంధించిన స‌మ‌స్య రావ‌టంతో కేర్ ఆస్ప‌త్రి కి త‌ర‌లించారు. అక్క‌డే చికిత్స పొందుతూ ఆయ‌న మ‌ర‌ణించారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. చంద్రబాబు మేనల్లుడు ఉదయ్‌కుమార్‌ (43)మృతి చెందారు. కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయ్‌కుమార్ కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఈరోజు ఉదయమే ఆయనను కేర్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Chandra Babu nephew Uday Kumar has expired..

చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు ఉదయ్‌కుమార్‌. ఈరోజు సాయంత్రం ఉదయ్‌కుమార్ మృతదేహాన్ని నారావారిపల్లెకు తరలించనున్నారు. రేపు శ‌నివారం ఉదయం నారావారిపల్లెలో ఉదయ్‌కుమార్‌ అంత్య క్రియ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు హాజరుకాను న్నారు. తొలుత హైద‌రాబాద్ వెళ్లాల‌ని భావించినా..అంత్య‌క్రియ‌లకు వెళ్లాల‌ని సీయం నిర్ణ‌యించుకున్నారు. కాగా, ఉద‌య్ కుమార్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రెండో అక్క హైమ‌వ‌తి కుమారుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+