ఆ రెండు జిల్లాలపై చంద్రబాబు - పవన్ కొత్త వ్యూహం..!!

వచ్చే ఎన్నికల వ్యూహాలపై టీడీపీ -జనసేన కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే మేనిఫెస్టో పైన ఒక అవగాహనకు వచ్చారు. వైసీపీకి పట్టు ఉన్న ప్రాంతాల్లో ఏ విధంగా ముందకెళ్లాలి..తమకు అనుకూలంగా ఉండే జిల్లాల్లో ఎలాంటి సమీకరణాలు అమలు చేయాలనే దాని పైన ప్రాధమికంగా ఒక అంచానకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టు నిరూపించుకుంటే..అధికారం ఖాయమనే ధీమాతో ఉన్నారు. అందులో భాగంగా కీలక ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు సమాచారం.

ఉమ్మడి వ్యూహంతో : గెలుపుకోసం టీడీపీ, జనసేన ఉమ్మడి వ్యూహంతో ముందుకుసాగుతున్నాయి.వచ్చే ఎన్నికలలో అధికారం దక్కాలంటే గోదావరి జిల్లాలు కీలకమైన నేపథ్యంలో ఆ జిల్లాల పై ఫోకస్ పెట్టాయి.జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో జెండా ఎగురవేసెందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు ఇదే గోదావరి జిల్లాల్లో దెబ్బ తీయాలనేది వైసీపీ వ్యూహం. దీంతో, టీడీపీ , జనసేనలు గట్టి ఫోకస్ పెట్టాయి. టీడీపీ జనసేన 2019 ఎన్నికలలో ఫలితాలను పరిగణన లోకి తీసుకొని సైలెంట్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. జనసేన గతంలో ప్రజారాజ్యం లో పని చేసిన వారితో సహా ఇతర పార్టీల్లోని నేతలతో రహస్య మంతనాలు కొనసాగిస్తుంది. రెండు పార్టీల పొత్తు ఖాయం కావడం తో ఇరు పక్షాల నేతలు సీట్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.

Chandra Babu - Pawan Kalyan foucs on Social equations in Godavari Dists, target on YSRCP

2014 రిపీట్ చేసేలా : 2014 ఎన్నికల్లో జనసేన -టీడీపీ పొత్తుతొ పశ్చిమ గోదావరిలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో 12 టీడీపీ, 5 వైసీపీ, 1 బీజేపీ, 1 స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. పశ్చిమ గోదావరిలో టీడీపీ కేవలం రెండు స్థానాలు పరిమితం అయింది.తూర్పు గోదావరి లో టీడీపీ 4 స్థానాలు గెలుచుకోగా, జనసేన ఒక్క చోట గెలిచింది. మిగిలిన స్థానాలు వైసీపీ గెలుపొందింది. టీడీపీకి 39.7 శాతం పోలయ్యాయి. వైసీపీకి 53.3 శాతం ఓట్లు దక్కాయి.

జిల్లాలో జనసేన ఒకే సీటు గెలిచినా 14.84 శాతం ఓట్లు దక్కించుకుంది. అదే విధంగా పశ్చిమ గోదావరిలో వైసీపీ 12 స్థానాల్లో గెలిచి 46.35 శాతం ఓటింగ్ దక్కించుకుంది.టీడీపీకి 36.30 ఓట్లు దక్కగా, జనసేనకు పశ్చిమలో 11.68 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ లెక్కల పరంగా టీడీపీ - జనసేన పొత్తు తో ఆ పార్టీల అధిక్యత కొనసాగే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నాయి.

Chandra Babu - Pawan Kalyan foucs on Social equations in Godavari Dists, target on YSRCP

హోరా హోరీ వ్యూహాలతో : దీంతో, గత ఎన్నికల్లో జగన్ కు అనుకూలంగా మారిన సామాజిక సమీకరణాలను ఈ సారి తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. కాపు సామాజిక వర్గం ఈ సారి ప్రధానంగా జనసేన వైపు చూస్తోందనే ప్రచారం నడుమ టీడీపీ తమ ఓట్ బ్యాంకు పదిలం చేసుకొనే ప్రయత్నాలు చేస్తోంది. పొత్తులు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో టీడీపీ ఈ అంశాన్ని అదనపు బలంగా భావిస్తోంది.

ఇక రెండు పార్టీల నుంచి గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కు పూర్తి స్థాయిలో బెయిల్ వచ్చాక అభ్యర్ధులను ఖరారు చేయనున్నారు. దీంతో, 34 సీట్లు ఉన్న గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం.. టీడీపీకి దక్కే సీట్లు.. వైసీపీ పట్టు నిలబెట్టుకొనేందుకు అమలు చేసే వ్యూహాలతో ఇక్కడ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+