స్టూడియోల చుట్టూ తిర‌గ‌మే ఆమె ప‌ని..ప‌ద్ద‌తి లేదు : చెవిరెడ్డి ఓ రౌడీ : న‌గ‌రి లో చంద్ర‌బాబు..!

టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చంద్ర‌గిరి..న‌గ‌రి స‌భ‌ల్లో పాల్గొన్నారు. త‌న స‌హ‌జ ధోర‌ణిలో జ‌గ‌న్‌..కేసీఆర్‌..మోదీ పై విరుచుకుప‌డ్డారు. ఇక, స్థానిక వైసిపి ఎమ్మెల్యేల పైనా కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ఓ రౌడీ అని..మ‌న పోలీసులు స‌రిగ్గా డీల్ చేయ‌లేద‌ని వ్యాఖ్యానించారు. న‌గ‌రి స‌భ‌లో రోజా పైనా చంద్ర‌బాబు ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేసారు.

స్టూడియోల చుట్టూ తిర‌గ‌టం..ప‌ద్ద‌తి లేదు..

స్టూడియోల చుట్టూ తిర‌గ‌టం..ప‌ద్ద‌తి లేదు..

న‌గ‌రి స‌భ‌లో టిడిపి అధినేత చంద్ర‌బాబు రోజా పేరు ఎత్త‌కుండానే స్థానిక ఎమ్మెల్యే అంటూ విమ‌ర్శ‌లు చేసారు. ఇక్క డ మీ ఎమ్మెల్యేకు నోరు పారేసుకోవడం తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. హైద‌రాబాద్ లోని స్టూడియో ల చుట్టూ తిర‌గ‌టం త‌ప్ప ఏం చేసార‌ని ప్ర‌శ్నించారు. నోటి దురుసు ఎక్క‌వ అన్నారు. ఆ పార్టీ అధినేత తనపై నోరు పారేసుకుంటారని, ఆ పార్టీ ఎమ్మెల్యే కూడా అదే విధంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. నోటి దురుసు తప్ప, ఒక పద్ధ తీపాడూ లేదని, ఆమె ఇష్టానుసారం మాట్లాడినా తానెప్పుడూ పట్టించుకోలేదని అన్నారు. వీళ్ల నాయకుడూ అంతే, వీళ్లూ అంతే అని జగన్, రోజాపై మండిపడ్డారు. నగ‌రి లో తానే అభివృద్ది చేసాన‌ని చెప్పుకొచ్చారు.

చెవిరెడ్డి ఓ రౌడీ..

చెవిరెడ్డి ఓ రౌడీ..

చంద్ర‌గిరి స‌భ‌లో స్థానిక వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి పైనా చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేసారు. చంద్ర‌గిరి త‌న‌కు రాజ‌కీయంగా జీవితం ఇచ్చింద‌న్నారు. తొలుత ఇక్క‌డి నుండే ఎమ్మెల్యేగా గెలిచి ఆ త‌రువాత కుప్పం కు వెళ్లానంటూ చంద్ర‌బాబు వివ‌రించారు. చంద్ర‌గిరి లో స్థానిక ఎమ్మెల్యే రౌడీయిజం చేస్తుంటే పోలీసులు కూడా సీరియ‌స్ గా వ్య‌వ‌హ రించ‌లేద‌ని వ్యాఖ్యానించారు. టిడిపి అభ్య‌ర్ది నాని ఇక్క‌డ స‌రైన వ్య‌క్తి అని భావించి సీటు ఇచ్చామ‌న్నారు. ఎన్నిక‌ల్లో ధీటుగా ఎదుర్కోవాల‌న్నారు. చంద్ర‌గిరి లో పెండింగ్ ప‌నుల‌ను పూర్తి చేసే బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని హామీ ఇచ్చా రు. ఇప్పికే పెన్ష‌న్ల పంపిణీ ప్రారంభ‌మైంద‌ని..రెండు రోజుల్లో ప‌సుపు - కుంకుమ నిధులు, రైతు రుణ‌మాఫీ, అన్న‌దాత సుఖీభ‌వ నిధులు కూడా ల‌బ్ది దారుల ఖాతాల్లో జ‌మ అవుతాయ‌ని చెప్పుకొచ్చారు.

కాకాని ఓ దొంగ సారా వ్యాపారి..

కాకాని ఓ దొంగ సారా వ్యాపారి..

నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. అక్క డ స్థానిక వైసిపి ఎమ్మెల్యే ను ఉద్దేశించి ఆయ‌న ఒక దొంగ సారా వ్యాపారి అని వ్యాఖ్యానించారు. ఆయ‌న ఓ మ‌హా నాయ కుడిలా మాట్లాడుతూ ఉంటార‌ని ఎద్దేవా చేసారు. కోడిక‌త్తి పార్టీకి ఓటు వేస్తే అది కేసీఆర్‌కు....మోదీకి వేసిన‌ట్లేనంటూ చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. స‌ర్వేప‌ల్లి అభివృద్ది చెందాలంటే..సంక్షేమ ప‌థ‌కాలు కొన‌సాగాలంటే టిడిపికి ఓటు వేయా ల‌ని పిలుపునిచ్చారు. ఒక్క సారి ఛాన్స్ అని వేడుకుంటున్నార‌ని..ఎవ‌రైనా ఒక్క‌సారి ఆత్మ‌హ‌త్య చేసుకుంటారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+