అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు మరోసారి - కేంద్రమే నిర్దారించింది : వైసీపీ ఎదురుదాడి..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు - ఆర్దిక నిర్వహణ పైన టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి పైర్ అయ్యారు. కేంద్రం శ్రీలంక పైన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఏపీతో సహా 11 రాష్ట్రాల ఆర్దిక పరిస్థితులను వివరించింది. దీని పైన వైసీపీతో సహా ఇతర పార్టీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేసాయి. కేంద్రం వ్యవహరించిన తీరు సరికాదని తప్పుబట్టాయి. అందులో భాగంగా వైసీపీ ఎంపీలు సైతం ఢిల్లీ వేదికగా ఏపీలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పులు..గతంలో టీడీపీ చేసిన అప్పుల గురించి మాట్లాడారు. సీఎం జగన్ సైతం ఇప్పటికే పలు సందర్భాల్లో తాను చంద్రబాబు కంటే తక్కవే అప్పులు చేశానని చెప్పుకొచ్చారు.

శ్రీలంలో చూసిన దుర్భర పరిస్థితులే

శ్రీలంలో చూసిన దుర్భర పరిస్థితులే

ఇక, కేంద్రం ఏపీ ఆర్దిక నిర్వహణ పైన చేసిన వ్యాఖ్యల పైన స్పందించిన చంద్రబాబు.. శ్రీలంలో చూసిన దుర్భర పరిస్థితులు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. మూలధన వ్యయం ఎక్కడా లేకపోవటంతో రాష్ట్రాభివృద్ది కుంటుపడిందని మండిపడ్డారు. రహదారులకు మరమ్మతులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ శ్రీలంక లాంటి పరిస్థితులు కాదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పనిచేసే ఉద్యోగులకు ఎప్పటి నుంచో సకాలంలో జీతాలు చెల్లించట్లేదని గుర్తు చేశారు.

ఉద్యోగులకూ చెల్లింపులు లేవు

ఉద్యోగులకూ చెల్లింపులు లేవు


జీపీఎఫ్ కూడా విత్ డ్రా చేసుకునే పరిస్థితి వారికి లేదనీ.., పదవీ విరమణ చేసినవారికి చేయాల్సిన చెల్లింపులు కూడా సక్రమంగా చేయట్లేదని విమర్శించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదన్న చంద్రబాబు.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, పార్లమెంట్ లో కేంద్రం ఏపీ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు గురించి కీలక ప్రకటన చేసింది. పోలవరం ఆలస్యం కావటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని తేల్చింది. అదే సమయంలో 2024 వరకు పోలవరం నిర్మాణం పూర్తి చేసేందుకు గడువు పెంచింది.

పోలవరం పై ఎదురుదాడి

పోలవరం పై ఎదురుదాడి


ప్రాజెక్టు ఇప్పటి వరకు 72 శాతం పూర్తయినట్లుగా పేర్కొంది. దీని పైన సైతం చంద్రబాబు స్పందించారు. పోలవరం నిర్లక్ష్యం ఎవరిదో కేంద్రమే నిర్ధారించిందన్న చంద్రబాబు.. పోలవరం విషయంలో తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు వైకాపా ప్రభుత్వం తెలుగుదేశంపై ఎదురుదాడి చేస్తోందని దుయ్యబట్టారు. అయితే, అటు కేంద్రం ..ఇటు చంద్రబాబు చెబుతున్న లెక్కలు.. చేస్తున్న వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి.

English summary
TDP Chief Chandra Babu once again fires on YSRCP Govt and compared state financial situation with Srilanka. He mentioned central govt statement on polavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X