అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
ఏపీలో ఎన్నికల ఘట్టం కీలక దశకు చేరింది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలో టీడీపీ అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉండి నుంచి రఘురామ రాజు పోటీకి లైన్ క్లియర్ అయింది. రామరాజుకు చంద్రబాబు నుంచి పిలుపు అందింది. దెందులూరు నుంచి చింతమనేని పోటీ పైన స్పష్టత వచ్చింది. ఇదే సమయంలో చిత్తూరు, అనంత జిల్లాల్లో రెండు సీట్ల మార్పు ఖాయంగా కనిపిస్తోంది.
అభ్యర్దుల మార్పు
అటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా..ఇటు చంద్రబాబు అభ్యర్దుల మార్పు కసరత్తు చేస్తున్నారు. ఉండి సీటు పైన కొంత కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కు చంద్రబాబు ముగింపు పలుకుతున్నారు. టీడీపీలో చేరిన రఘురామ రాజుకు ఉండి సీటు ఖాయమైంది. ఈ రోజు అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

ఇక్కడ నుంచి ఇప్పటికే టీడీపీ అభ్యర్దిగా ప్రకటించిన రామారాజును తనను కలవాల్సిందిగా చంద్రబాబు సూచించారు. రామారాజుకు పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించారు. అయితే, ఇప్పటికే రామరాజు అనుచరులు ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబును కలుస్తున్నాని..తన మద్దతుదారుల అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని రామరాజు చెబుతున్నారు.
ఉండిలో రాజుల వార్
ఇప్పటికే ఉండి నుంచి మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామ రాజు స్వతంత్ర అభ్యర్దిగా బరిలో ఉన్నారు. దీంతో రఘురామకు సీటు అధికారికంగా ప్రకటిస్తే రామరాజు నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. అటు దెందులూరు పైన ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగింది. బీజేపీకి కేటాయించిన అనపర్తి సీటు తిరిగి టీడీపీకి ఇవ్వాలంటే తమకు దెందులూరు సీటు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించింది.
అయితే, రెండు పార్టీల నేతల చర్చల తరువాత తంబళ్లపల్లె సీటు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ పోటీకి పార్టీ నాయకత్వం అనుమతిచ్చింది. ఇక, పాడేరు సీటు విషయంలోనూ మార్పు ఖాయమని తెలుస్తోంది.

చంద్రబాబు నిర్ణయం
నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరు సీటు విషయంలోనూ టీడీపీలో వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ ఇంటూరు నాగేశ్వరరావును పార్ట అభ్యర్దిగా ప్రకటించింది. అయితే, రెబల్ గా ఇంటూరు రాజేశ్ పోటీ చేస్తున్నారు. టీడీపీకి చెందిన కీలక నేత దివి శివరాం తన మద్దతు రాజేశ్ కు ఉంటుందని ప్రకటించారు.
ఇదే జరిగితే నెల్లూరు ఎంపీ స్థానం పైన ప్రభావం ఉంటుందని టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో..టీడీపీ ముఖ్య నేతలు రాజీకి రంగంలోకి దిగారు. అదే విధంగా అనంతపురంలోనూ రెండు సీట్లలో మార్పు ఉంటుందని తెలుస్తోంది. నామినేషన్లు కొనసాగుతుండటంతో వెంటనే అభ్యర్దుల మార్పు అంశం తేల్చాలని చంద్రబాబు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications