ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలులో కీలక పరిణామం..!!

ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు పైన ఫోకస్ చేసింది. అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల పైన కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన అమలు పైన అధికారులు నివేదిక అందించారు. నెలకు రూ250 కోట్లు మేర ఖర్చు అవుతుందని తేల్చారు. ఈ పథకం అమలు పైన తుది నిర్ణయం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు.

ప్రభుత్వానికి నివేదిక
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ఈ పథకం అమలు చేయాలంటే నెలకు రూ 250 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు లెక్కలు తేల్చారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు.. అక్కడ ఏయే బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు, ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ ఎలా.. తదితరాలన్నీ అధ్యయనం చేశారు. సీఎం చంద్రబాబు ఆర్టీసీ, రవాణా శాఖలపై సోమవారం నిర్వహించనున్న సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కీలక చర్చ జరగనుంది.

Chandra Babu to review with officials over implementation of Free bus for women

నెలకు రూ 250 కోట్లు
ఆర్టీసీలో నిత్యం సగటున 36-37 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 40 శాతం మంది అంటే 15 లక్షల వరకు మహిళలు ఉంటున్నారు. వీరికి ఉచిత ప్రయాణం అమలుచేయాల్సి ఉంటుంది.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు.. హైదరాబాద్‌ నగరంలో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. కర్ణాటకలోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో, బెంగళూరులోని సిటీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించే విధానం అమలు చేస్తున్నారు.

చంద్రబాబు తుది నిర్ణయం
టికెట్ల రూపంలో వచ్చే రాబడి, స్టూడెంట్, సీజనల్‌ పాస్‌లు.. తదితరాలన్నింటి రూపంలో ప్రతి నెలా ఆర్టీసీకి రాబడి తగ్గుతుంది. మరోవైపు ఆర్టీసీకి టికెట్ల ద్వారా నెలకు సగటున రూ.500 కోట్లు వస్తుండగా, ఇందులో రూ.220 కోట్ల వరకు డీజిల్‌కే వెచ్చిస్తారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తున్నందున.. రాబడిలో నెలకు సగటున రూ.125 కోట్లు (25%) ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎంత పరిధి వరకు అమలు చేయాలి, ఏయే సర్వీసులకు వర్తింపజేయాలనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సోమవారం సీఎం వద్దజరిగే సమీక్షలో.. వీటిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+