ప్రధానికి చంద్రబాబు కీలక ప్రతిపాదన - బిగ్ టర్న్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రధానితో సమావేశం కానున్నారు. ఏపీ ఆర్దిక పరిస్థితుల పైన వివరించటంతో పాటుగా కీలక ప్రతిపాదనకు సిద్దమయ్యారు. కేంద్ర బడ్జెట్ లో అమరావతికి రూ 15 వేల కోట్ల రుణం ఇప్పించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ప్రపంచ బ్యాంక్ టీం అమరావతిలో పర్యటించింది. రాజధానితో పాటుగా రాష్ట్రానికి ఆర్దికంగా వెసులుబాటు కలిగించేలా చంద్రబాబు కీలక ప్రతిపాదనలతో ప్రధాని మోదీతో సమావేశానికి సిద్దమయ్యారు.
కీలక ప్రతిపాదనలు
ప్రధానితో సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం భేటీ ఫిక్స్ అయింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. నష్టపోయిన ఏపీకి... ఏపీ అన్ని విధాలుగా నష్టం పోయిందని ప్రత్యేకంగా గుర్తించి రాష్ట్రానికి తగిన సాయం అందించాలని చంద్రబాబు కోరనున్నారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించనున్నారు. రుణాల రీషెడ్యూల్ చేయాలని కోరనున్నారు. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రాష్ట్రానికి రుణ పరిమితి తక్కువగా ఉంది. ఈ సమయంలో కేంద్రం ప్రత్యేకంగా వెసులుబాటుతో పాటుగా ఆర్దికంగా అండగా నిలవాలని కోరనున్నారు.

అండగా నిలవండి
అమరావతి నిర్మాణానికి సంబంధించి సహకారం అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర పరిధిలో రుణాలు కాకుండా.. ప్రత్యేకంగా రుణ సదుపాయం కల్పించటం ద్వారా రాష్ట్రం పైన తక్షణ ప్రభావం ఉండదు. 30 ఏళ్ల తరువాత రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా అమరావతికి తీసుకొనే రుణంలో కేంద్రం ఎంత వరకు గ్రాంటుగా ఇస్తుందనేది ఈ పర్యటనలో చంద్రబాబు స్పష్టత కోరుతున్నారు. ఈ అంశాల పైన ప్రదానితో పాటుగా సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు.
కేంద్రం పైనే భారం
రాత్రి ఏడు గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామల పైన చర్చించనున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. లేదంటే మరో సీజన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ముందు కొత్త డయాఫ్రం వాల్ కట్టాలి. తర్వాత ఎర్త్ కం రాక్ ఫిల్(ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మించాలి. కాఫర్ డ్యాంలు కొంత తగ్గించి.. సీపేజ్ మొ త్తం ఎత్తిపోస్తూ వాల్ పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు.












Click it and Unblock the Notifications