టీడీపీ తొలి అభ్య‌ర్ద‌న: ఆమోదించేందుకు జ‌గ‌న్ సిద్ద‌మేనా : వార‌డిగేది..సాధ్య‌మ‌య్యేదేనా..!

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఓ అభ్య‌ర్ధన. రాష్ట్రంలో ఎన్నిక‌ల్లో ప‌రాజయం త‌రువాత మాజీ ముఖ్య‌మంత్రి పార్టీ నేత‌ల‌తో సుదీర్ఘంగా స‌మావేశ‌మ‌య్యారు. పార్టీ ఓట‌మి మీద విశ్లేష‌ణ‌లు చేసుకున్నారు. ఏపీలో కొత్త ప్ర‌భుత్వం ప‌ని తీరు మీద చ‌ర్చించారు. అదే స‌మ‌యంలో వారికి ఇక్క‌డ ఒక అవ‌స‌రం వ‌చ్చింది. అంతే, దీని పైన వెంట‌నే పార్టీ త‌ర‌పున ముఖ్య‌మంత్రికి లేఖ రాయాల‌ని..ఒక ప్ర‌తినిధి బృందం ద్వారా అది సీఎంకు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. మ‌రి..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆ అభ్య‌ర్ధ‌న‌ను అంగీక‌రిస్తారా..

ప్ర‌జా వేదిక‌ను అప్ప‌గించండి..

ఉండవ‌ల్లిలో మాజీ ముఖ్య‌మంత్రి ప్ర‌స్తుతం ఉంటున్న నివాసం..దీనికి అనుబంధంగా నాడు ప్ర‌భుత్వ ఖ‌ర్చుతో నిర్మించిన ప్ర‌జా వేదిక‌ను ప్ర‌తిప‌క్ష నేత అధికారిక నివాసంలో ఇవ్వాల‌ని టీడీపీ కోరుతోంది. పార్టీ నేత‌ల‌తో అధినేత చంద్ర‌బాబు సుదీర్ఘంగా స‌మావేశ‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలో అమ‌రావ‌తి ప‌రిధిలో ఎక్క‌డ నుండి కార్య‌క్ర‌మాలు ప‌ర్య‌వేక్షించాల‌నే అంశం పైన సుదీర్ఘంగా చ‌ర్చించారు.

Chandra Babu wants to continue in Prajavedika as his official residence..cm Jagan may consider

ప్రజావేదిక చంద్రబాబు ఉంటోన్న ఇంటికి అనుబంధంగా ఉందని, దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసం కోసం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. ఆ లేఖ‌ను పార్టీ ప్ర‌తినిధి బృందం తో జ‌గ‌న్ వ‌ద్ద‌కు పంపాల‌ని డిసైడ్ అయ్యారు. అదే స‌మ‌యంలో పార్టీ కార్య‌క్ర‌మాల‌కు విజ‌య‌వాడ‌లో మ‌రో భ‌వ‌నం సిద్దం చేయాల‌ని పార్టీ నేత‌ల‌కు అధినేత చంద్ర‌బాబు సూచించారు.

జ‌గ‌న్ అంగీక‌రించేనా..

ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో..ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ ముందే జ‌గ‌న్ అమ‌రావ‌తిలో భారీ భూ కుంభ‌కోణ జ‌రిగింద‌ని ఆరోపించారు. దీని పైన విచార‌ణ అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఇక‌, తొలి నుండి నాటి సీఎం చంద్ర‌బాబు కృష్ణా క‌ర‌క‌ట్ట మీద అక్ర‌మించిన నిర్మాణంలో చంద్ర‌బాబు ఉంటున్నార‌ని పలుమార్లు ఆరోపించారు. అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో భాగంగా స‌మావేశాలు..ప్ర‌జ‌ల‌తో క‌ల‌వ‌టానికి వీలుగా ప్ర‌భుత్వ నిధుల‌తో ఆ ఇంటి ప‌క్క‌నే ప్ర‌జా వేదిక‌ను నిర్మించారు.

Chandra Babu wants to continue in Prajavedika as his official residence..cm Jagan may consider

ఇప్పుడు ఆ ప్ర‌జా వేదిక‌ను ప్ర‌తిప‌క్ష నేత అధికార నివాసంగా ఇవ్వాల‌ని టీడీపీ కోరుతోంది. ఆ నిర్మాణ‌మే అక్ర‌మ‌మ‌ని జ‌గ‌న్ తో స‌హా పార్టీ నేత‌లు వాదిస్తున్న స‌మ‌యంలో టీడీపీ అభ్య‌ర్ధ‌న‌ను అంగీక‌రిస్తే..ఆ అక్ర‌మ నిర్మాణాల‌కు ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేసిన‌ట్లే. దీంతో..ఇప్పుడు జ‌గ‌న్ అంత సులువుగా టీడీపీ అభ్య‌ర్ద‌న అమోదించే ప‌రిస్థితి క‌నిపించ‌టం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+