చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!

ఏపీలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు అభ్యర్దులు తమ నామినేషన్లు దాఖలు చేసారు. చంద్రబాబు తరుపున ఆయన సతీమణి కుప్పంలో నామినేషన్ సమర్పించారు. ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు ఆస్తుల వివరాలను వెల్లడించారు. అందులో చంద్రబాబు ఆస్తులు అయిదేళ్ల కాలంలో 39 శాతం పెరిగినట్లు చూపించారు. చంద్రబాబు ఆస్తుల విలువ రూ 810 కోట్లుగా పేర్కొన్నారు.

నామినేషన్ దాఖలు
ఎన్నికల కమిషన్‌కు 2019లో నామినేషన్‌ సమయంలో ఇచ్చిన అఫిడవిట్‌ ప్రకారం చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తులు రూ.668 కోట్లు ఉన్నాయి. కాగా, తాజాగా దాఖలు చేసిన నామినేషన్ లో ప్రస్తుత ఆస్తుల విలువ ను వెల్లడించారు. ఆస్తుల విలువ రూ 810 కోట్లుగా వివరించారు. ఇందులో అధిక శాతం హెరిటేజ్‌ ఫుడ్స్‌, నిర్వాణ హోల్డింగ్స్‌ వంటి సంస్థల్లో పెట్టుబడులుగా ఉన్నట్లుగా చూపించారు.

Chandrababu and his family assets reaching a total of Rs 810 42 crore increased by over 39 percent in the past five years

వీటితో పాటు భువనేశ్వరి దగ్గర 3 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి ఉన్నాయని వెల్లడించారు. స్థిరాస్తుల విషయానికొస్తే.. హైదరాబాద్‌, ఏపీ, తమిళనాడులో ఇళ్లు, పొలాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేసుల విషయానికొస్తే చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయి. చంద్రబాబు పేరు మీద మొత్తం రూ.36.36 కోట్లు ఆస్తులున్నాయి.

చంద్రబాబు - భువనేశ్వరి ఆస్తులు
చంద్రబాబు పేరుతో రూ .36.36 కోట్లు ఆస్తులున్నాయి. వీటిలో చరాస్తులు రూ.4.80 లక్షలు, వీటిలో ఏపీ9జీ393 నంబరు అంబాసిడర్‌ కారు విలువ రూ.2,22,500.. బంగారం లేదని చూపించారు. స్థిరాస్తులు రూ.36.31 కోట్లున్నాయి.

కుమారుడు లోకేశ్‌తో కలిసి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నారు. సతీమణి భువనేశ్వరికి కలిపి రూ.931 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇక..చరాస్తులు రూ.4.80 లక్షలుగా పేర్కొన్నారు. స్థిరాస్తులు రూ.36.31 కోట్లున్నాయి. కుమారుడు లోకేశ్‌తో కలిసి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నారు.

కేసుల వివరాలు వెల్లడి
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆస్తులు రూ.895 కోట్లు. వీటిలో చరాస్తులు రూ.810.37 కోట్లు.. ఇందులో హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌లోని 2,26,11,525 షేర్ల విలువ రూ.763.93 కోట్లు. బంగారం, ఇతర ఆభరణాలు కలిపి రూ.1.40 కోట్లు. స్థిరాస్తులు రూ.85.10 కోట్లు కాగా.. అప్పులు రూ.6.83 కోట్లు. ఇందులో కుమారుడు లోకేశ్‌ నుంచి రూ.1.27 కోట్లు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.

ఆదాయపన్ను శాఖ నుంచి రూ.6,04,900 డిమాండ్‌ నోటీసుపై వివాదం ఉందని ప్రస్తావించారు. చంద్రబాబు పైన కేసుల అంశాన్ని వివరించారు. 2019కు ముందు ఆయనపై కేవలం రెండు కేసులు ఉన్నాయి.. ఈ ఐదేళ్లలో 22 కేసులు నమోదయ్యాయి. వాటిలో సీఐడీ నమోదు చేసిన కేసులు ఎనిమిది ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+