వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాగడ పట్టిన చంద్రబాబు: అరెస్టులకు వ్యతిరేకంగా తమ్ముళ్ల ప్రదర్శనలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోపాటు నేతలు, కార్యకర్తలు ఆదివారం రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. అమరావతి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పార్టీ నేతలు వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి కాగడా పట్టుుకని నిరసన తెలిపారు చంద్రబాబు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రలోభాలకు లొంగని తెలుగుదేశం పార్టీ నేతలపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ఏడాది పాలనలో కక్ష సాధింపు చర్యలే తప్ప చేసిందేమీ లేదన్నారు. పులివెందుల రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

 chandrababu and other TDP leaders protest all over Andhra pradesh

ప్రతిపక్ష పార్టీల నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ పార్టీ నేతలు నిరసన తెలిపారు. గుంటూరులో ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ మాగంటి బాబు వారి నివాసాల వద్దే కాగడాలను ప్రదర్శించారు. అచ్చెన్నాయుడు, ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Recommended Video

Chandrababu Naidu's Conistable Tested Positive For Corona Virus

వైసీపీ ప్రభుత్వ ప్రలోభాలకు లొంగని వారిని జగన్ సర్కారు తప్పుడు కేసులు పెడుతూ.. అరెస్ట్ చేస్తోందంటూ మండిపడ్డారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాయతీ నడుస్తోందని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో చీకటి పాలన కొనసాగుతోందన్నారు. ఈ పాలన ఎక్కువ కాలం కొనసాగదని వ్యాఖ్యానించారు.

English summary
chandrababu and other TDP leaders protest all over Andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X